`పేటా` లో రజిని పాత్ర ఇదే
సూపర్ స్టార్ రజినీకాంత్ కు వయసు మీద పడుతున్న ఏమి లెక్క చేయకుండా వరసబెట్టి సినిమాలు మీద సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నాడు. వరసగా 'కబాలి', 'కాలా', 'రోబో 2.0' ఖాళీ లేకుండా చేసినా రజిని లేటెస్ట్ గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో 'పేటా' సినిమా చేశాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి విడుదల అవుతున్న ఈసినిమా తరువాత మరో సినిమాని కూడా లైన్ పెట్టాడు తలైవా.
సెన్సషనల్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో రజిని ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 2019 స్టార్టింగ్ ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి 2019 లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసినిమా లేట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా 'పేటా' సినిమా యొక్క సాంగ్స్ ఆల్బం సూపర్ హిట్ అయినా సంగతి తెల్సిందే.
ఇందులో రజిని డాన్‌గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది కానీ... లేడీస్ హాస్టల్ వార్డెన్ పాత్రలో కనిపించనున్నాడని తాజా సమాచారం. ఓ లేడీస్ హాస్టల్లో వార్డెన్‌గా చేరతాడని, అక్కడే ‘పేటా’ కథ అనేక మలుపులు తిరుగుతుందని చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. రజినీకి జోడిగా ఇందులో త్రిష..సిమ్రాన్ నటిస్తున్నారు. విజయ్ సేతుపతి..నవాజుద్దీన్ సిద్దికీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.