Mon Dec 23 2024 06:51:20 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజుల్లో రజనీ ఇంత విధ్వంసమా..!
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ ఉంది
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ ఉంది. అమెరికాలో మాత్రమే కాకుండా.. మిడిల్ ఈస్ట్ లో కూడా జైలర్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లో ఓవర్సీస్ సెంటర్స్ లో జైలర్ సినిమా దాదాపు 9 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. భారత కరెన్సీ ప్రకారం దాదాపు 70 కోట్ల రూపాయలు. కోలీవుడ్ నుంచి పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ అమెరికాలో 8.1 మిలియన్ డాలర్స్ ని రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది. రజినీ జైలర్ పొన్నియిన్ సెల్వన్ రికార్డ్స్ ని దాటేస్తుందని భావిస్తున్నారు.
జైలర్ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించగా.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్ సాధించింది. నైజాంలో 6.35 కోట్లు, సీడెడ్: 1.78 కోట్లు, ఉత్తరాంధ్ర : 1.71 కోట్లు, తూర్పు : 92 లక్షలు, పశ్చిమ: 57 లక్షలు, గుంటూరు : 1.12 కోట్లు, కృష్ణ : 93లక్షలు, నెల్లూరు : 42లక్షలు వచ్చింది. ఏపీ తెలంగాణలో మొత్తంగా 13.81 కోట్ల షేర్ రాగా.. 23.65 కోట్ల గ్రాస్ వచ్చింది. తెలుగులో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 214.15 కోట్ల గ్రాస్ రాగా.. 105.10 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమా 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, నాగేంద్ర బాబు, రమ్య కృష్ణన్, సునీల్, వసంత్ రవి, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రజినీకాంత్ పవర్ఫుల్ రోల్ లో కనిపించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
Next Story