Mon Dec 23 2024 06:52:31 GMT+0000 (Coordinated Universal Time)
జైలర్ సినిమాకు ఊహించని షాక్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆగస్ట్ 10న థియేటర్లలోకి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆగస్ట్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. ఈ సినిమా HD (హై-డెఫినిషన్) వెర్షన్.. OTT విడుదలకు కొన్ని వారాల ముందే ఆన్లైన్లో లీక్ అయింది. భారీ కలెక్షన్స్ రికార్డును కొల్లగొట్టే సమయంలో ఇలా లీక్ అవ్వడం పట్ల రజనీకాంత్ అభిమానులు షాక్ అవుతూ ఉన్నారు. సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతూ ఉండడంతో ఈ లింక్‌ను షేర్ చేసి పైరసీని ప్రోత్సహించవద్దని పలువురు రజనీకాంత్ అభిమానులు కోరుతున్నారు.
ఆగస్ట్ 10న విడుదలైన 'జైలర్' ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయల దిశగా పయనిస్తోంది. ఇంతలో 'జైలర్' హై-డెఫినిషన్ ప్రింట్ ఇంటర్నెట్లోకి ప్రవేశించింది. ‘జైలర్’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా థియేటర్ యజమానులకు ఇది షాక్‌గా మారింది. పైరసీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సోషల్ మీడియాలో లింక్‌ను షేర్ చేయవద్దని చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ డైరెక్టర్ రేవంత్ చరణ్ అభిమానులను అభ్యర్థించారు. జైలర్ తెలుగు వెర్షన్ 75 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని అంటున్నారు. ఓవరాల్ డబ్బింగ్ సినిమాల్లో తెలుగులో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కేజీయఫ్‌ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండిట్స్ భావిస్తూ ఉండగా.. హెచ్డీ ప్రింట్ లీక్ అవ్వడంతో ఆ కలెక్షన్స్ కు గట్టి ఎదురుదెబ్బనే అని అంటున్నారు.
Next Story