Mon Dec 23 2024 13:45:52 GMT+0000 (Coordinated Universal Time)
రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ మూవీ అప్డేట్ వచ్చేసింది..
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రజిని ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్తే. తాజాగా ఈ వార్త..
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకొని అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం తరువాత తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న 'లాల్ సలామ్' సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. అలాగే తన 170వ సినిమాని 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్ తో చేయబోతున్నాడు. తాజాగా ఇప్పుడు 171వ సినిమాని కూడా అనౌన్స్ చేసేశాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రజిని ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్తే. తాజాగా ఈ వార్త నిజం అయ్యింది. జైలర్ నిర్మాత కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. నేడు ఈ సినిమాని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి గుర్తిండిపోయే హిట్టుని అందించాడు లోకేష్. దీంతో ఇప్పుడు రజినితో లోకేష్ సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. రజిని తన 170వ సినిమా, లోకేష్ కి తన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవి పూర్తి అయ్యిన తరువాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. ఇది ఇలా ఉంటే.. కార్తీ 'ఖైదీ', కమల్ హాసన్ 'విక్రమ్'ని కనెక్ట్ చేస్తూ లోకేష్ కనగరాజ్ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజిని మూవీని కూడా ఆ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కిస్తాడా..? అనే సందేహం నెలకుంది అందరిలో.
ఇక రజిని 170వ సినిమా విషయానికి వస్తే.. లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, తెలుగు యాక్టర్స్ లో నాని లేదా శర్వానంద్ నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Next Story