Mon Nov 25 2024 06:47:47 GMT+0000 (Coordinated Universal Time)
మలేషియా ప్రధానితో రజినీకాంత్..
రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా మలేషియా ప్రధానితో..
రజినీకాంత్ (Rajinikanth) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియాతో పాటు ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులు ఉంటారు. ఇక జపాన్, మలేషియా దేశాల్లో అయితే.. ఇక్కడి ఫ్యాన్స్ లాగానే వీరాభిమానులు ఉంటారు. సాధారణ ప్రజలతో పాటు దేశ అధికారులు కూడా రజినిని అభిమానిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) రజినిని కలుసుకున్నారు.
రీసెంట్ గా రజినీకాంత్ మలేషియా వెళ్ళాడు. ఇక అక్కడ ప్రధాని ఆఫీస్ లో అన్వర్ ఇబ్రహీంని రజిని ప్రత్యేకంగా కలుసుకున్నాడు. అన్వర్ ఇబ్రహీం రజినీకి ఎదురొచ్చి మరి ఆహ్వానం పలకడం విశేషం. ఆ సమయంలోనే అన్వర్ ఇబ్రహీం.. రజిని నటించిన 'శివాజీ' సినిమాలోని 'బాస్ గుండు బాస్' అనే డైలాగ్ ని యాక్షన్ తో చేసి చూపించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక అనంతరం ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు.
ఈ భేటీలో రజినీకాంత్.. అన్వర్ ఇబ్రహీం ప్రజా పాలన గురించి అభినందిస్తూ మాట్లాడాడు. ఇక ప్రధాని అన్వర్.. ''రజినిని సోషల్ మెసేజ్ సినిమాలు తీయాలని కోరినట్లు'' ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా రజినీకాంత్ మలేషియా ప్రధానిని కలుసుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో 2017 సమయంలో అప్పటి ప్రధాని 'నజీబ్ రజాక్'ని రజిని కలుసుకున్నాడు.
ఆ సమయంలో ఒక రూమర్ కూడా బాగా వైరల్ అయ్యింది. మలేషియా పర్యాటక శాఖ అంబాసడర్ గా రజినీకాంత్ నియమించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిలో ఎటువంటి నిజం లేదని రజిని చెప్పుకొచ్చాడు. 'కబాలి' షూటింగ్ దాదాపు మలేషియాలోనే జరిగినా.. ఆ సమయంలో ఆయనని కలుసుకోలేకపోయినట్లు, ఆ తరువాత ఆయన నుంచి ఆహ్వాననం రావడంతో వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇటు భారతీయ నాయకులను, అటు విదేశీ నాయకులను కూడా తన అభిమానులను చేసుకోవడం ఒక్క రజినికే సాధ్యపడింది.
Next Story