రజిని.. ఎందుకు అంత స్పీడూ?
రజిని - శంకర్ కాంబినేషన్ లో విడుదలకు రెడీ అవుతున్న చిత్రం 2.ఓ . ఈ సినిమాపై రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతున్నాయి. దానికి కారణం ఈ సినిమా రిలీజ్ పెరుమార్లు వాయిదా పడడమే. హెవీ గ్రాఫిక్స్ ఉన్నందున ఈ సినిమా లేట్ అవుతుందని మొదటి నుంచి చెబుతున్నారు. కానీ అనుకున్న దాని కంటే 2.ఓ బాగా లేట్ అయింది. ఈ సినిమాల లేట్ అవ్వడంతో రజిని 'కాలా' సినిమా త్వరగా పూర్తి చేసేశారు.
ఇంకా క్లారిటీ లేదుగా...
ఈ గురువారమే ఈ సినిమా విడుదల కానుంది. ఇక రోబో సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. దసరాకి, దీపావళి అంటున్నారు. కానీ అది కూడా గ్యారంటీ లేదు. కానీ రజిని మాత్రం ఈ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా రజిని ముందుగా సైన్ చేసిన ప్రకారం కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న మూవీ చేయడానికి రెడీ అయ్యిపోయాడు.
రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలపైనే..
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 7న డెహ్రాడూన్ లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. సిమ్రన్, విజయ్ సేతపతి, బాబీ సింహ ఈ మూవీలో నటిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా 2.ఓ చిత్రం రిలీజ్ కన్నా ముందే అయ్యిపోయినా, 2.ఓ చిత్రాన్నే ముందుగా రిలీజ్ చేయాలనీ కోరుకుంటున్నారు రజిని ఫ్యాన్స్. ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉన్న రజిని తన కాన్సంట్రేషన్ అంతా అటు వైపు కేంద్రీకరించకుండా.. ఇటు సినిమాలు పైన ఎందుకు చూపిస్తున్నాడో అర్ధం కానీ విషయం.