ఈ సినిమాల ముందు రజిని అక్కడ నిలవగలడా…?
ప్రస్తుతం రజినీకాంత్ మార్కెట్ కి ఓ అన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన.. గత ఏడెనిమిదేళ్ళుగా హిట్ కొట్టిన సందర్భమే లేదు. రోబో సినిమా తర్వాత ఆ [more]
ప్రస్తుతం రజినీకాంత్ మార్కెట్ కి ఓ అన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన.. గత ఏడెనిమిదేళ్ళుగా హిట్ కొట్టిన సందర్భమే లేదు. రోబో సినిమా తర్వాత ఆ [more]
ప్రస్తుతం రజినీకాంత్ మార్కెట్ కి ఓ అన్నంత క్రేజ్ లేదు. ఎందుకంటే ఆయన.. గత ఏడెనిమిదేళ్ళుగా హిట్ కొట్టిన సందర్భమే లేదు. రోబో సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ రజినీకాంత్ కొట్టలేకపోయాడు. కనీసం మొన్న విడుదలై 2.0 సినిమాని కొన్న బయయ్ర్లు కూడా బాగా లాస్ అయ్యారు. ఇక లింగా, కబాలి, కాల ఇలా వరసగా సినిమాలు పోవడంతో రజినీకాంత్ కి మార్కెట్ అనూహ్యంగా పడిపోయింది. రజిని చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ… సినిమా టాక్ తో కలక్షన్స్ మాత్రం అమాంతం పడిపోతాయి. తాజాగా రజిని – కార్తీక్ సుబ్బరాజుల పేట చిత్రం వరల్డ్ వైడ్ గా జనవరి 10 న విడుదలకాబోతుంది.
అయితే తెలుగులో ఓ మాదిరి బిజినెస్ ని జరుపుకున్న పెటా సినిమ తమిళనాట మాత్రం భారీ బిజినెస్ జరుపుకుంది. తెలుగులో గతంలో రజినీకాంత్ సినిమాలకు భీభత్సమైన పోటీ ఉండేది. కానీ గత కొంతకాలంగా రజిని నుండి వస్తున్నా సినిమాల్తో బయ్యర్లు బెంబేలెత్తుతున్నప్పుడు.. ఇక నిర్మాతలెవరూ రజినీకాంత్ సినిమాలు ఏ ధైర్యంతో కొంటారు. అయితే తెలుగులో వల్లభనేని అశోక్ పేట తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోగా… ఓవర్సీస్ లో తెలుగు, తమిళ హక్కులను కలిపి 10 కోట్లకు అమ్మారు. అయితే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు జోరెక్కువ.
మరి ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు ఎన్టీఆర్, వినయ విధేయరామ, ఎఫ్ టు లను తట్టుకుని పెటా లాభాలను తేవాలంటే కాస్త కష్టమైనా పనే. మరి అక్కడ పేట బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎలా లేదన్నా.. 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. కానీ తెలుగు సినిమాల హడావిడిలో పెటా 2.5 మిలియన్ డాలర్లు వసూలు చెయ్యడం సామాన్యమైన విషయం కాదు. అందులోను రజిని సినిమాలకు క్రేజ్ బాగా పడిపోయింది. మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి ఓవర్సీస్ లో తెలుగు సినిమాల హడావిడిలో పేట పరిస్థితి ఏమిటో చూద్దాం.