‘పేట’ స్టోరీ అదిరిపోయిందిగా
సూపర్ స్టార్ రజిని కాంత్ ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలతో పలకరించాడు. జనవరి 10న ‘పెట్ట’ సినిమా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలు ఉన్న ఈసినిమాను [more]
సూపర్ స్టార్ రజిని కాంత్ ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలతో పలకరించాడు. జనవరి 10న ‘పెట్ట’ సినిమా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలు ఉన్న ఈసినిమాను [more]
సూపర్ స్టార్ రజిని కాంత్ ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలతో పలకరించాడు. జనవరి 10న ‘పెట్ట’ సినిమా రిలీజ్ అవుతుంది. భారీ అంచనాలు ఉన్న ఈసినిమాను యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసాడు. రజినీతో పాటు నవాజుద్దీన్ సిద్ధిక్..విజయ్ సేతుపతి..శశికుమార్..బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈసినిమా యొక్క ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచేసింది. ఈసినిమాతో రజిని సూపర్ హిట్ అందుకోడం ఖాయం అంటున్నారు అతని ఫ్యాన్స్.
ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులు నుండి ‘పెట్ట’ సినిమా కథ ఒకటి కోలీవుడ్ మీడియాల్లో హల్ చల్ చేస్తుంది. కాళీ(రజనీకాంత్)ఓ గ్రామం పెద్ద. త్రిష ని పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉంటాడు. ఊరులో ఏ సమస్యలు వచ్చినా రజిని తీరుస్తూ ఉంటాడు. కాళీ కి అతని తమ్ముడు మలిక్(శశికుమార్)అంటే ప్రాణం. అనుకోకుండా ఆ ఊరుకి సింగార్ సింగ్(నవాజుద్దీన్ సిద్ధిక్) వల్ల ముప్పు ఏర్పడుతుంది. ఆ గొడవల్లో కాళీ తమ్ముడు మలిక్ అండ్ తన భార్య ని పోగొట్టుకుని ఆ వూరు వదిలి వెళ్ళిపోతాడు. వేరే రాష్ట్రము కు వెళ్లి అక్కడ హాస్టల్ కి వార్డెన్ గా పనిచేస్తుంటాడు. అక్కడ విద్యార్ధి నాయకుడు మైకేల్(బాబీ సింహ)దే రాజ్యం. అతనికి కాళీ నచ్చకపోవడంతో అతన్ని కాలేజ్ నుండి పంపే ప్రయత్నం చేస్తుంటాడు మైకేల్.
అక్కడే సిమ్రాన్ పై మనసు పారేసుకుంటాడు కాళీ. ఊరిలో గొడవలు వల్ల దెబ్బ తిని కసి మీదున్న జీతూ(విజయ్ సేతుపతి)కాళీని చంపేందుకు సింగార్ సింగ్ తో పాటు తిరుగుతూ వుంటారు. మరి వీరిద్దరూ కలిసి కాళీ ని ఏం చేస్తారు? ఆ పద్మవ్యూహాన్ని ఎలా చేధించాడు అనేదే ‘పెట్ట’ కథ. ఆశలు కాళీ ఊరు వదిలి ఎందుకు వచ్చేశాడు అనేది కూడా సినిమాలోనే చూడాలి అంటున్నారు. పాయింట్ అయితే కొంచం ఆసక్తికరంగా ఉన్న కార్తీక్ సుబ్బరాజ్ ఎలా డీల్ చేసాడో చూడాలి.