జపాన్ అభిమానులకు 'జైలర్' ఫీవర్.. చెన్నై చేరిన జంట
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆయన్ను దేవుడిలా పూజిస్తారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆయన్ను దేవుడిలా పూజిస్తారు. విదేశాల్లోనూ 'తలైవా'కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండేళ్ల తర్వాత రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. జైలర్ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ పోస్టర్ల ఎదుట పటాకులు పేల్చి, పూలవర్షం కురిపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. వీటన్నింటి నడుమ ఓ జపాన్ జంట తామే రజనీకాంత్‌కి నిజమైన అభిమానులని నిరూపించుకుంది.
రజనీకాంత్ సినిమా జైలర్ చూడటానికి జపాన్‌లోని ఒసాకా పౌరుడు యసుదా హిడెతోషి, అతని భార్యతో చెన్నై చేరుకున్నారు. యసుదా హిడెతోషి మాట్లాడుతూ.. “మేము జైలర్ సినిమా చూడటానికి జపాన్ నుండి చెన్నైకి వచ్చాము.” రజనీకాంత్ గత చిత్రాలను చూడటానికి కూడా భారతదేశానికి వచ్చానని తెలిపాడు. అభిమానులతో కలిసి రజనీకాంత్ చిత్రాన్ని థియేటర్లో చూడటాన్ని ఎంజాయ్ చేస్తామన్నారు. తమిళంలో మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' చిత్రంతో రజనీకాంత్ రెండేళ్ల తర్వాత వెండితెరపై పునరాగమనం చేశారు. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లలో విడుదలైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషిస్తున్నారు. జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, వినాయకన్‌తో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 'జైలర్' చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.