Mon Dec 23 2024 06:17:00 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి 'జైలర్'.. స్ట్రీమింగ్ ఎక్కడ..? ఎప్పుడు..?
రజినీకాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) దాదాపు 13 ఏళ్ళ తరువాత బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. 2010 లో వచ్చిన 'రోబో' సినిమా తరువాత మళ్ళీ రజినీకి ఆ రేంజ్ హిట్ పడలేదు. ఇప్పుడు 'జైలర్' సినిమాతో మొత్తం లెక్కలు అన్ని సరి చేశాడు. బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 10న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇక కలెక్షన్స్ వర్షం కురిపించడం స్టార్ట్ చేసింది.
బాక్స్ ఆఫీస్ వద్ద 100, 200 కోట్లు మార్క్ ని దాటుకుంటూ.. రూ.625 కోట్ల గ్రాస్ వరకు చేరుకుంది. రిలీజ్ అయ్యి 20 రోజులు పైనే అవుతున్నా ఇక కొన్ని చోట్ల ఈ మూవీకి హౌస్ ఫుల్ షోలు పడుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజులు ఈ చిత్రం 650 కోట్ల మార్క్ ని అందుకున్న ఆశ్చర్య పడనక్కర్లేదు. ఇక ఈ మూవీని థియేటర్ లో చూసిన వారు కూడా.. ఓటీటీకి వస్తే మరోసారి చూడడానికి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
ఈ మూవీ సెప్టెంబర్ 7 నుంచి నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. తెలుగుతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజ్స్ లో ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్ లో చూసిన వారు లేదా అసలు చూడని వారు ఓటీటీలో రజిని గ్రాండ్ కమ్ బ్యాక్ ని ఎంజాయ్ చేసేయండి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, సునీల్, నాగబాబు, తమన్నా, రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాని 200 కోట్ల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశాడు. ఇక పెట్టిన పెట్టుబడికి ట్రిపుల్ రేంజ్ లో కలెక్షన్స్ రావడంతో నిర్మాత.. వచ్చిన లాభాల్లో కొంత బాగాన్ని రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ కి అందజేశాడు. అలాగే టాప్ బ్రాండ్ మోడల్ కార్లను కూడా ఇద్దరికీ బహుమతిగా ఇచ్చాడు.
Next Story