Mon Dec 23 2024 10:49:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రిలో ఐశ్యర్య
రజనీకాంత్ కుమార్తె ఐశ్యర్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలిపింది
కరోనా థర్డ్ వేవ్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అన్ని జాగ్రత్తలు పాటించి తొలి రెండు వేవ్ లలో కరోనా బారిన పడని వారికి సయితం థర్డ్ వేవ్ చుక్కలు చూపిస్తుంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా ఒక్కసారి అలా వచ్చి పోవాలన్న తీరులో కరోనా అందరికీ సోకుతుంది. అయితే పెద్దగా ప్రమాదం లేకపోవడం, ఆసుపత్రల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో కరోనా సోకిన వారు కూడా పెద్దగా భయపడటం లేదు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా....
ఇక సినీ పరిశ్రమను సయితం కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా రజనీకాంత్ కుమార్తె ఐశ్యర్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. తాను అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కరోనా సోకిందని తెలిపారు. ఐశ్వర్య ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, అందరూ టీకాలు తీసుకుని సురక్షితంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
Next Story