Mon Dec 23 2024 15:14:28 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలోకి అనుభవించు రాజా.. ఎప్పుడంటే..?
రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన మాస్ ఎంటర్టైనర్ అనుభవించురాజా ఈనెల 17వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది
రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన మాస్ ఎంటర్టైనర్ అనుభవించురాజా. ఈ సినిమా వచ్చి 15 రోజులైనా కాకుండానే.. ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి 100 పర్సెంట్ ఎంటర్టైన్ మెంట్ ఇస్తున్న ఆహా లో అనుభవించు రాజా స్ట్రీమింగ్ అవ్వనుంది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కౌషిష్ ఖాన్ నటించగా.. సుదర్శన్, ఆడుగలం నరేన్, అజయ్, పోసాని కృష్ణమురళి కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రాజకీయాలు, యాక్షన్, హాస్యం వంటి ఎలిమెంట్స్ ను చూపించాడు దర్శకుడు.
ఆహా లో....
భీమవరంలో ఉం డే బంగార్రాజు అలియాస్ బంగారం అనే యువకుడి చుట్టూ తిరిగే కథే అనుభవించు రాజా. బంగార్రాజు ఓ ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోతాడు. తాతయ్య దగ్గర పెరుగుతాడు. ఆయన చనిపోతూ జీవితాన్ని సరదాగా గడపాలని చెబుతాడు. తాతయ్య చెప్పిన మాటతో.. ఉన్న డబ్బంతా జల్సాలకు తగలేస్తుంటాడు బంగారం. కానీ.. అనుకోనీ పరిస్థితుల్లో బంగార్రాజు జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో పట్నానికి వెళ్లి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా జాయిన్ అవుతాడు. అక్కడే హీరోయిన్ తో ప్రేమలో పడిన బంగార్రాజు.. ప్రియురాలికి తన గతం గురించి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? బంగార్రాజు తిరిగి ఊరికి వెళ్లాడా ? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అనేదే కథ.
Next Story