రిలీజ్ అయిన సినిమానే మళ్లీ చేస్తున్న రాజ్ తరుణ్..
వరస ఫ్లాప్లతో సతమతం అవుతున్న టైంలో రాజ్ తరుణ్ 'రాజుగాడుగా' మన ముందుకు గత శుక్రవారం వచ్చాడు. ఈ సినిమాపై విడుదలకు ముందు నుండే బజ్ లేకపోవడంతో రిలీజ్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉంది. కలెక్షన్స్ కూడా డల్ గా ఉండడంతో రాజ్ తరుణ్ తన తర్వాత సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
సేఫ్ గేమ్ మొదలుపెట్టాడు....
అందుకే రాజ్ తరుణ్ సేఫ్ సైడ్ కోసం తమిళ్ సినిమాను ఇక్కడ రీమేక్ చేయనున్నాడు. తమిళ్ లో నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ' నానుమ్ రౌడీ దాన్' ను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్ తరుణ్. కానీ ఆ సినిమా 'నేను రౌడీనే' తెలుగులోనూ రిలీజ్ అయ్యి పర్లేదు అనిపించుకుంది.
డబ్ అయిన సినిమానే మళ్లీ...
మరి ఆల్రెడీ తెలుగులో డబ్ అయిన సినిమాను రాజ్ తరుణ్ ఎందుకు టచ్ చేస్తున్నాడో అర్ధం కావట్లేదు. ఒకవేళ రీమేక్ చేసినా రాజ్ తరుణ్ ఏ మేరకు ఆకట్టుకోగలడో చూడాలి. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన సినిమాను తెలుగులో 'వీరుడొక్కడేగా' రిలీజ్ అయిన 'వీరం' సినిమాను మళ్లీ 'కాటమరాయుడు' పేరుతో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. అయితే ఆ సినిమా తెలుగులో సరిగా ఆడలేదు. మరోపక్క రవితేజ కూడా తమిళ్ హిట్ మూవీ 'తేరి' ను ఇక్కడ రీమేక్ చేసే పనిలో ఉన్నాడు.