‘రాక్షసుడు‘గా బెల్లంకొండ శ్రీనివాస్
ఏ హీరో అయినా ఫ్లాప్ సినిమా తగిలినప్పుడు కొంచెం గ్యాప్ తీస్కొని సినిమాలు మొదలు పెడతాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం సినిమాల ఫ్లాప్స్ తో సంబంధమే [more]
ఏ హీరో అయినా ఫ్లాప్ సినిమా తగిలినప్పుడు కొంచెం గ్యాప్ తీస్కొని సినిమాలు మొదలు పెడతాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం సినిమాల ఫ్లాప్స్ తో సంబంధమే [more]
ఏ హీరో అయినా ఫ్లాప్ సినిమా తగిలినప్పుడు కొంచెం గ్యాప్ తీస్కొని సినిమాలు మొదలు పెడతాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం సినిమాల ఫ్లాప్స్ తో సంబంధమే లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. సినిమాల మీద సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. కవచం అలా విడుదలయిందో లేదో సీత సినిమాతో సెట్స్ మీదకెళ్లిపోయాడు. ప్రస్తుతం సీత సినిమా విడుదలకు దగ్గరవుతుంటే మరోవైపు తమిళ రాచ్చసన్ సినిమాకి రీమేక్కీ పరుగులు పెడుతున్నాడు. దర్శకుడు శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ తమిళ రాచ్చసన్ మూవీ తెలుగులో రీమేక్ అవుతుంది.
రాక్షసుడు టైటిల్ ఫిక్స్
తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన రాచ్చసన్ తెలుగులో చిన్న చిన్న మార్పులతో సెట్స్ మీదకి తీసుకెళుతున్నాడు శ్రీవాస్. తమిళ రాచ్చసన్ లో అమలా పాల్ చేసిన క్యారెక్టర్ ని తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేస్తుంది. అయితే తాజాగా తమిళ రాచ్చసన్ కి తెలుగు రీమేక్ టైటిల్ గా రాక్షసుడుగా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. రాక్షసుడు అనే టైటిల్ అయితే తొందరగా కనెక్ట్ అవుతుందని, అందుకే అదే టైటిల్ కి దర్శకుడు శ్రీవాస్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాక్షసుడు టైటిల్ కి ఇంకా బెల్లంకొండ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అయితే బెల్లకొండ శ్రీనివాస్ కూడా అదే టైటిల్ ని ఓకే చేస్తే ఆ టైటిల్ ని ఉగాది కానుకగా ఈ శనివారం అధికారికంగా ప్రకటిస్తుందట టీం.