Thu Dec 26 2024 12:02:08 GMT+0000 (Coordinated Universal Time)
రష్మికతో మ్యారేజ్ బ్రేకప్ పై రక్షిత్ శెట్టి కామెంట్స్..
రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ చేసుకొని విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న రక్షిత్..
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమించుకొని, పెళ్లి వరకు వెళ్లి విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. రక్షిత్ హీరోగా తెరకెక్కిన 'కిరాక్ పార్టీ' సినిమాతోనే రష్మిక ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీ మేకింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి పెళ్ళికి వరకు వెళ్లారు. 2017లో ఈ ఇద్దరు తమ కుటుంబసభ్యుల మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నారు.
కానీ ఏమైందో ఏమో 2018లో ఈ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరు సినిమాలతో బిజీ అయ్యిపోయారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు మళ్ళీ ప్రేమ, పెళ్లి అని మాట్లాడలింది లేదు. ఇక వీరి బ్రేకప్ గురించి కూడా వీరిద్దరూ బయట పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. తాజాగా రక్షిత్ దీని గురించి మాట్లాడాడు. రక్షిత్ నటించిన రీసెంట్ మూవీ ‘సప్త సాగరాలు దాటి’ తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
ఈక్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రక్షిత్ని.. 'మీ బ్రేకప్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. మీరెందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు' అని ప్రశ్నించారు. దీనికి రక్షిత్ శెట్టి బదులిస్తూ.. "బ్రేకప్ తరువాత నా పర్సనల్ జీవితాన్ని పూర్తిగా మర్చిపోయాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా సినిమా పైనే పెట్టాను. సినిమానే నా ప్రెజెంట్ లవ్" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
కాగా రక్షిత్ శెట్టి ప్రస్తుతం తెలుగులో కూడా మార్కెట్ పెంచుకొనే ప్రయత్నంలో ఉన్నాడు. 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన రక్షిత్.. గత ఏడాది '777 చార్లీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తాజాగా ఇప్పుడు ‘సప్త సాగరాలు దాటి’ అనే ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. సెప్టెంబర్ 22న తెలుగులో రిలీజ్ అయ్యింది.
Next Story