ఎంతందంగా ఉన్నావే..!!
ఈమధ్యన రకుల్ బక్కచిక్కి.. మోడరన్ డ్రెస్సుల్లో కాస్త ఎబ్బెటుగానే కనబడుతుంది. సౌత్ సినిమాలు లేక బాలీవుడ్ లో నెగ్గాలంటే సైజు జీరో గా మారాలని రకుల్ ప్రీత్ [more]
ఈమధ్యన రకుల్ బక్కచిక్కి.. మోడరన్ డ్రెస్సుల్లో కాస్త ఎబ్బెటుగానే కనబడుతుంది. సౌత్ సినిమాలు లేక బాలీవుడ్ లో నెగ్గాలంటే సైజు జీరో గా మారాలని రకుల్ ప్రీత్ [more]
ఈమధ్యన రకుల్ బక్కచిక్కి.. మోడరన్ డ్రెస్సుల్లో కాస్త ఎబ్బెటుగానే కనబడుతుంది. సౌత్ సినిమాలు లేక బాలీవుడ్ లో నెగ్గాలంటే సైజు జీరో గా మారాలని రకుల్ ప్రీత్ రోజు వర్కౌట్స్ చేస్తూ.. బక్కచిక్కి.. మోహంలో కళను కోల్పోయింది. మిడ్డీస్, ఫ్రాక్స్, షార్ట్స్ అంటూ రకుల్ డ్రెస్సింగ్ స్టయిల్ అదిరినప్పటికీ… రకుల్ ప్రీత్ మాత్రం మరీ బక్క పల్చగా అందవిహీనంగా తయారైంది అనేది వాస్తవం. గ్లామర్ మోజులో పది మరీ రకుల్ ఇలా తయారైంది ఏమిటి అనుకోని వాళ్ళు లేరు. అయితే తాజాగా రకుల్ ప్రీత్ కట్టిన సారీ తో చీరకి అందం రావడమే కాదు.. రకుల్ సారీ అందాలను చూస్తుంటే ఇదే కదా రకుల్ కావాల్సింది అనిపించకమానదు.
మేకప్ తో వచ్చిన అందమో.. లేదంటే చీర కట్టు అందాలో…. లేదా రకుల్ అందాలు కాస్త పెరిగాయో కానీ.. రకుల్ తాజా చీర జాకెట్టులో అదిరింది. అందమైన చీర లో రకుల్ అందాలతో పాటుగా హొయలు పోతూ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిక్కిన అందాలతో వెగటు పుట్టిస్తున్న రకుల్.. ఇపుడు చీర లో కాస్త బొద్దుగా ముద్దుగా కనబడే సరికి అందరూ ఎంతందంగా ఉన్నావే అంటూ సాంగ్ ఏసుకుంటున్నారు. సౌత్ లో ఉన్నప్పుడు కాస్త బుగ్గలు తో మురిసిపోయే రకుల్ బాలీవుడ్ కెళ్ళాక మరీ చిక్కింది. మరి తాజాగా రకుల్ ప్రీత్ సారీ అందాలు మాత్రం సూపర్బ్ అనేలా ఉన్నాయి. అకేషన్ ఏదైనా చీర అందాలు ఏ గ్లామర్ డ్రెస్సుకి రావనేది రకుల్ తాజా లుక్ చూస్తే తెల్సుతుంది.
- Tags
- à°°à°à±à°²à±