ఇంజినీర్, డాక్టర్ ఎలాగో నేను నటిని అంతే..!!
ఇంజినీర్ లు ఇంజినీర్ అని, డాక్టర్స్ డాక్టర్ అని ఎలా చెప్పుకుంటారో నేను అలాగే నటిని అని చెప్పుకుంటాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. అసలు నేను [more]
ఇంజినీర్ లు ఇంజినీర్ అని, డాక్టర్స్ డాక్టర్ అని ఎలా చెప్పుకుంటారో నేను అలాగే నటిని అని చెప్పుకుంటాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. అసలు నేను [more]
ఇంజినీర్ లు ఇంజినీర్ అని, డాక్టర్స్ డాక్టర్ అని ఎలా చెప్పుకుంటారో నేను అలాగే నటిని అని చెప్పుకుంటాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. అసలు నేను హీరోయిన్ అనే విషయాన్నే మరిచిపోతుంటాను. అలాంటిది స్టార్ హీరోయిన్ అని ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటూ చమత్కరిస్తుంది. అసలు స్టార్ హీరోయిన్ అని పిలిచినా నాకు ఏం లాభం చెప్పండి అంటుంది రకుల్. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లిస్ట్ నుండి బయటికి వచ్చేసిన రకుల్ ప్రీత్ టాలీవుడ్ అవకాశాలు కోసం వెతుక్కుంటుంది. కానీ ఆ నిజాన్ని ఒప్పుకోదు. మీడియా మీదే సెటైర్స్ వేస్తుంది. ఇక ఇంజినీర్స్ ఎలాగో, డాక్టర్స్ ఎలాగో నేను నటిని అంతే.. అంతకు మించి గుర్తింపు అక్కర్లేదు.
ఇక కలలంటారా? అందరికి కలలు ఉంటాయి. నాకు ఉన్నాయి. కన్న కలలన్ని తీరిపోతే అందులో మజా ఏముంటుంది. ఒక వేళ నేను కనిన కలలు నెరవేరినా… నాకు మల్లి మరుసటి రోజు కొత్త కల వస్తుంది. నేను అలాగే కలలు కనే రకాన్ని.. నేను ఎంత సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా సాధించేది ఇంకా ఉంది, చెయ్యాల్సింది ఉంటుంది. నా లక్షాన్ని అలా పెంచుకుంటూ పోతానంటుంది. ఇక ప్రస్తుతం హీరోయిన్స్ అంతా కరోనా అని స్తబ్దుగా ఉంటె.. రకుల్ మాత్రం షూటింగ్స్ పెట్టండి నేను వచ్చేస్తా అంటూ తాను నటిస్తున్న మూవీ టీమ్స్ కి కబురు పెడుతుందట.