Fri Dec 27 2024 03:17:30 GMT+0000 (Coordinated Universal Time)
గడ్డకట్టే నీటిలో బికినీలో రకుల్ ఐస్ బాత్.. వీడియో వైరల్
గడ్డకట్టే చలిలో రకుల్ చేసిన అడ్వెంచర్ చూసి అవాక్కవుతున్నారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో బికినీలో.. గడ్డ కట్టే నీటిలో..
స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ కూడా ఒకరు. ఆమె నటించిన సినిమాల్లో గ్లామర్ షో కి బాగానే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటు సోషల్ మీడియాలోనూ వయ్యారాలు ఒలకబోస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా రకుల్ ఓ రియల్ అడ్వెంచర్ చేసి.. అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఆ వీడియో రకుల్ ఇన్ స్టా లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది.
గడ్డకట్టే చలిలో రకుల్ చేసిన అడ్వెంచర్ చూసి అవాక్కవుతున్నారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో బికినీలో.. గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసింది రకుల్. -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంటే ఎంతో ధైర్యం కావాలని అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రకుల్ ప్రీత్ చేసిన ఈ సాహసం అభినందనీయమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ కి టాలీవుడ్ లో అవకాశాలు తక్కువగా ఉన్నా.. కోలీవుడ్, బాలీవుడ్ లలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. కాగా.. ఇటీవలే మరో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఐస్ బాత్ చేస్తూ ఫొటోలు షేర్ చేసింది.
Next Story