Sun Dec 22 2024 17:59:27 GMT+0000 (Coordinated Universal Time)
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫోటోలు చూశారా..!
బాలీవుడ్ నిర్మాతతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమా ఛాన్సులు అందుకోవడంతో పాటు అక్కడి నిర్మాత గుండెల్లో ప్రియురాలిగా కూడా స్థానం దక్కించుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో పడిన రకుల్ ఆ విషయాన్ని.. 2021లో అందరికి తెలియజేసారు. ఇక అప్పటి నుంచి బి-టౌన్ లో అతడితో కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న రకుల్.. ఈ బుధవారం అతనితో ఏడడుగులు వేసేసారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో గోవాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బుధవారం ఫిబ్రవరి 21న సిక్కు, సింధీ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్లిలో ఇరు కుటుంబసభ్యులతో పాటు మరికొంతమంది స్నేహితులు హాజరయ్యారు. బాలీవుడ్ తారలు కొంతమంది ఈ పెళ్ళికి హాజరయ్యి సందడి చేసారు. ఇక వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వాటి వైపు ఓ లుక్ వేసేయండి.
Next Story