రకుల్ కి నెగెటివ్!
ప్రస్తుతం కరోనా స్ట్రెయిన్ అలజడి సృష్టిస్తున్న టైంమ్ లో వరసగా సినిమా సెలబ్రిటీస్ కరోనా బారిన పడడం అందరిని కలవరపెడుతుంది. చాలామంది సెలబ్రిటీస్ కరోనా కారణముగా చనిపోయారు [more]
ప్రస్తుతం కరోనా స్ట్రెయిన్ అలజడి సృష్టిస్తున్న టైంమ్ లో వరసగా సినిమా సెలబ్రిటీస్ కరోనా బారిన పడడం అందరిని కలవరపెడుతుంది. చాలామంది సెలబ్రిటీస్ కరోనా కారణముగా చనిపోయారు [more]
ప్రస్తుతం కరోనా స్ట్రెయిన్ అలజడి సృష్టిస్తున్న టైంమ్ లో వరసగా సినిమా సెలబ్రిటీస్ కరోనా బారిన పడడం అందరిని కలవరపెడుతుంది. చాలామంది సెలబ్రిటీస్ కరోనా కారణముగా చనిపోయారు కూడా. కొంతమంది సెలబ్రిటీస్ కరోనా బారిన పది కోలుకున్నవారు ఉన్నారు. షూటింగ్స్ హడావిడి పెరిగిన టైం లో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించడం ఆందోళన కలిగించే అంశమే. మొన్నటికి మొన్న కరోనా పాజిటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేవని రకుల్ ప్రీత్ ట్వీట్ చెయ్యడం.. నేడు రామ్ చరణ్ కరోనా బారిన పడడంతో అందరికి షాక్ ఇచ్చింది. రామ్ చరణ్ కి కూడా ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో రామ్ చరణ్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా ట్వీట్ చేసాడు.
ఇక కరోనా బారిన పడిన రకుల్ కూడా కోలుకుంది. యోగాసనాలకు, డైట్, జిమ్ వర్కౌట్స్ తో రకుల్ త్వరగానే కోలుకుంది. తాజాగా ఆమెకి కరోనా టెస్ట్ చేయించుకోగా దానిలో నెగిటివ్ రావడంతో పట్టలేనంత సంతోషంతో అభిమానులతో పంచుకుంది. కరోనా వచ్చింది అని చెప్పగానే నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని ట్వీట్ చేసింది. 10 రోజులనుండి హోమ్ క్వారంటైన్ లోనే గడుపుతున్న రకుల్ ప్రీత్ కి తాజాగా నెగెటివ్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిపాటి రెస్ట్ తో రకుల్ తన సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవుతుంది అని సమాచారం.
- Tags
- rakul preet