సైరా టీం సభ్యులపై ఆగ్రహం
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహరెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఉయ్యాలవాడ జీవిత కథని ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యుల [more]
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహరెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఉయ్యాలవాడ జీవిత కథని ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యుల [more]
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహరెడ్డి సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఉయ్యాలవాడ జీవిత కథని ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యుల ఆమోదంతోనే సినిమాని తెరకేక్కించారు. కాగా ఉయ్యాలవాడ ఫ్యామిలీ సైరా సినిమా తీసినందుకు గాను తమకు న్యాయం చెయ్యాలంటూ ఈ మధ్యన చిరు ఇంటిముందు, కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ ముందు ఉయ్యాలా వాడ ఫ్యామిలీ ధర్నాలు చేసింది. అయితే ఈ సమస్య ని రామ్ చరణ్ ఐదు కోట్లతో పరిష్కారం చేసినట్లుగా చెప్పారు.
5 కోట్లు ఇస్తామన్నారేమైంది….
ఉయ్యాలవాడ వంశీకులు 22 మందికి మొత్తం 5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేయించుకున్నరట. కానీ ఇప్పటివరకు తమకు ఒక్క పైసా న్యాయం కూడా జరగలేదని ఉయ్యాలవాడ ఫ్యామిలీ మల్లీ నేడు కొణిదెల ఆఫీస్ ముందు ధర్నాకి దిగగా బంజారాహిల్స్ పోలీసులు ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో ఉయ్యాలవాడ ఫ్యామిలీ సభ్యులు సైరా టీం మీద తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.