అల్లు అరవింద్ ను పంపిన చిరంజీవి
గత కొన్ని రోజులు నుండి నిర్మాత దానయ్య కు డైరెక్టర్ బోయపాటి కి పడడం లేదని తెలిసిందే. వినయ విధేయ రామ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు [more]
గత కొన్ని రోజులు నుండి నిర్మాత దానయ్య కు డైరెక్టర్ బోయపాటి కి పడడం లేదని తెలిసిందే. వినయ విధేయ రామ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు [more]
గత కొన్ని రోజులు నుండి నిర్మాత దానయ్య కు డైరెక్టర్ బోయపాటి కి పడడం లేదని తెలిసిందే. వినయ విధేయ రామ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టం కలగకుండా తమ రెమ్యూనరేషన్ లో 5 కోట్లు వెనక్కి ఇవ్వాలని పెట్టిన కండిషన్ కి బోయపాటి ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం మరింత పెద్దది అయింది. రీసెంట్ గా రామ్ చరణ్ బోయపాటిదే తప్పు అన్నట్టు లెటర్ రిలీజ్ చేయడంతో బోయపాటి హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. ఈ గొడవ పెద్దది అవ్వడంతో అల్లు అరవింద్ అండ్ చిరంజీవి రంగంలోకి దిగారు.
తాజా సమాచారం ప్రకారం చిరంజీవి.. చరణ్ ని ఉద్దేశించి …ఫిల్మ్ బిజినెస్ లోకి ఓ నటుడు ఇన్వాల్వ్ అవ్వటం తప్పు పట్టారని తెలుస్తోంది. ఏమైనా ఉంటె నిర్మాతలు చూసుకుంటారు నీకు ఏమి సంబంధం అని గట్టిగా అడిగారట. ఈ విషయం నీకు అనవసరం అని చెప్పి ఈ సెటిల్మెంట్ చేయటానికి అల్లు అరవింద్ ని రంగంలోకి దించారు. అల్లు అరవింద్ కి బోయపాటి కి మంచి రాపో ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో అల్లు అరవింద్ బ్యానర్ లో బోయపాటి సరైనోడు చిత్రం తో సూపర్ హిట్ ఇచ్చారు. అంతేకాదు ఈ బ్యానర్ లోనే మరో సినిమా చేయనున్నాడు బోయపాటి. దాంతో ఇప్పుడు బోయపాటిని ఐదు కోట్లు వెనక్కి ఇవ్వటానికి ఒప్పించటానికి అల్లు అరవింద్ సరైన వ్యక్తి అని భావించి చిరు ఆయన్ను పంపారని తెలుస్తోంది. మరి అందుకు బోయపాటి ఒప్పుకుని ఆ 5 కోట్లు వెనక్కి ఇచ్చేస్తాడో లేడో చూడాలి.