మొదటి రెండు ఓకె.. మరి మిగతా రెండూ..
ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాతి పండగేమో కానీ.. సినిమాల పండగ మాత్రం మొదలైంది. మొన్న బుధవారం నుండి థియేటర్స్ లో సినిమాల మీద విడుదలవుతానే ఉన్నాయి. ప్రేక్షకుడికి [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాతి పండగేమో కానీ.. సినిమాల పండగ మాత్రం మొదలైంది. మొన్న బుధవారం నుండి థియేటర్స్ లో సినిమాల మీద విడుదలవుతానే ఉన్నాయి. ప్రేక్షకుడికి [more]
ప్రస్తుతం టాలీవుడ్ లో సంక్రాతి పండగేమో కానీ.. సినిమాల పండగ మాత్రం మొదలైంది. మొన్న బుధవారం నుండి థియేటర్స్ లో సినిమాల మీద విడుదలవుతానే ఉన్నాయి. ప్రేక్షకుడికి ఏ సినిమా చూడాలో కూడా ఆలోచించడానికి గ్యాప్ ఇవ్వనన్నీ సినిమాలు రోజుకొకటి చొప్పున థియేటర్స్ లో హడావిడి మొదలు పెట్టాయి. బుధవారం మొట్టమొదటిగా బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ కథానాయకుడిని ప్రేక్షకులు ముందు తేవడం.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగాయి. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కథానాయకుడిగా ఇరగదీశాడని ప్రేక్షకులు చెబుతున్నమాట. నిడివి ఎక్కువ లాగింగ్ సీన్స్ వలన కాస్త నెగటివ్ పడింది కానీ.. సినిమా సూపర్ అంటున్నారు. ఇక ప్రేక్షకులే కాదు.. రివ్యూ రైటర్స్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడి కి ఓవరాల్ గా త్రీ రేటింగ్స్ ఇచ్చేసి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేసారు.
మరి ఈ సంక్రాంతికి మొదటిగా బోణీకొట్టిన బాలయ్య థియేటర్స్ లో ఉండగానే.. నిన్న గురువారం కోలీవుడ్ నుండి రజినీకాంత్ పెటా రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. పెటా సినిమాలో రజినీకాంత్ స్టయిల్ కి ఆయన అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకుడు కూడా ఫిదా అవుతున్నాడు. కాకపోతే పెటా సినిమా రజిని అభిమానులకే అన్నటుగా ఉందని.. ప్రేక్షకుల తీర్పు ఇవ్వడమే కాదు.. రివ్యూ రైటర్స్ కూడా పేట కి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. ఇక వీక్ ప్రమోషన్స్ కూడా పేట కలెక్షన్స్ కి దెబ్బపడేలా కబడుతున్నాయి… అసలే థియేటర్స్ కొరతతో, పేట నిర్మాత.. ఇటు ప్రమోషన్స్ ని పట్టించుకోలేదు.
ఇక ఆ రెండు సినిమాల పరిస్థితి అలా ఉంటే.. ఇక ఈరోజు ముచ్చటగా మూడో సినిమాగా బరిలోకి దిగబోతున్న రామ్ చరణ్ వినయ విధేయరామ మీద భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ – కైరా అద్వానీ జంటగా వివేక్ ఒబెరాయ్ విలన్ గా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయరామ టాక్ మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. ఇక రేపు శనివారం మరో ఫ్యామిలీ, కామెడీ ఎంటెర్టైనెర్ కూడా బరిలోకి చివరి సినిమాగా రాబోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ ల ఎఫ్ టు మల్టీస్టారర్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ప్రమోషన్స్ మాత్రం కాస్త వీక్ అన్నట్టుగా ఉన్నాయి. ఈ రోజు, రేపు విడుదలకాబోయే సినిమాలకు ప్రేక్షకులిచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది అనేది చాలా తక్కువ సమయంలోనే తెలిసిపోతుంది.