Sat Dec 21 2024 08:11:12 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో ఎంతసేపు అలరించబోతున్నాడంటే..!
ఈ సినిమాలో చరణ్ ఎంతసేపు కనిపించనున్నాడనే ప్రశ్నకు ప్రమోషన్స్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ వెల్లడిస్తూ
హైదరాబాద్ : ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానున్న 'ఆచార్య' సినిమా కోసం అభిమానులు అంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఎంతసేపు కనిపించనున్నాడనే ప్రశ్నకు ప్రమోషన్స్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ వెల్లడిస్తూ ఉంది. ఈ సినిమాలో 'సిద్ధ' అనే పాత్రను గెస్టుగా చూపించాలని అనుకున్నారు. తెరపై ఈ పాత్రను ఓ 15 నిమిషాల పాటు చూపించాలనుకున్నారు. కానీ ఆ పాత్ర అద్భుతంగా ఉండడంతో క్యారెక్టర్ ను పెంచుతూ వెళ్లారట. అలా 15 నిమిషాలు మాత్రమే అనుకున్న ఈ పాత్ర నిడివి 45 నిమిషాలకు పెరిగినట్టుగా చెబుతున్నారు. చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు, ఆ తరువాత కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది.
ఆచార్య కథ విన్నప్పుడే ఆ పాత్ర తనకు బాగా ఒంట పట్టిందని రామ్ చరణ్ అన్నారు. రాజమౌళి చెప్పినట్లు నేను ఆర్ఆర్ఆర్ నుంచి ఆచార్య షూటింగుకు ఒక ఖాళీ కాగితంలా వెళ్లాను. దర్శకుల ద్వారా ఆయా సినిమాల పాత్రలు అర్థం చేసుకుని ఆ పాత్రల్లో లీనమైపోతానని రామ్ చరణ్ తెలిపారు. వేరే సినిమాల్లో చాలా కష్టపడి నటించాల్సి వస్తుంది. కొరటాల శివ వంటి దర్శకుల స్క్రిప్ట్ లో చాలా బలం ఉంటుంది. పాత్రల్లో నటించడం సులభం అవుతుంది. నా హిట్ సినిమాలన్నింటిలోనూ ఈ అనుభవాన్ని నేను చవిచూశానని రామ్ చరణ్ తెలిపాడు.
Next Story