Sun Dec 22 2024 18:57:02 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : షారుఖ్ పాటకి చిరంజీవి స్టెప్పులు.. చరణ్ చప్పట్లు..
షారుఖ్ పాటకి చిరంజీవి స్టెప్పులు వేస్తుంటే రామ్ చరణ్ చప్పట్లు కొడుతూ సందడి చేస్తూ కనిపించారు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చాలా సందడిగా ఉంటూ కనిపిస్తుంటారు. పండుగల సమయంలో కుటుంబసభ్యులు అందరి మధ్య ఒక చిన్న పిల్లాడిలా మారిపోయి సందడి చేస్తుంటారు. తాజాగా చిరు ఇంట దివాళీ బ్యాష్ జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన హోస్ట్ చేసిన ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ లోని స్టార్స్ నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా అందరూ కదిలి వచ్చారు.
ఆ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కోటిగా బయటకి వస్తూ ఉన్నాయి. తాజాగా ఆ దివాళీ బ్యాష్ నుంచి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో చిరంజీవి షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీ టైటిల్ సాంగ్ కి డాన్స్ వేస్తూ కనిపించారు. షారుఖ్ పాటకి చిరంజీవి స్టెప్పులు వేస్తుంటే రామ్ చరణ్ చప్పట్లు కొడుతూ సందడి చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వీడియోని మీరుకూడా చూసేయండి.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. త్వరలో Mega156 ని పట్టాలు ఎక్కించబోతున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమా ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు పెట్టుకోనుందని సమాచారం. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో చిరంజీవి తన ఏజ్ కి తగ్గ పాత్రని పోషించబోతున్నారట.
మూవీలో హీరోయిన్ తో రొమాన్స్ వంటి సీన్స్ ఉండవని వశిష్ఠ తేల్చి చెప్పేశారు. చిరు రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందంటూ దర్శకుడు చెప్పుకొస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం చంద్రబోస్ తో కలిసి కీరవాణి సాంగ్స్ ని సిద్ధం చేస్తున్నారు. చోట కె నాయడు ఈ సినిమాకి డిఒపిగా పనిచేస్తున్నారు. అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమాల తరువాత చాలా గ్యాప్ తో చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సబ్జెట్ కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.
Next Story