Fri Dec 20 2024 21:55:13 GMT+0000 (Coordinated Universal Time)
రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్ర యూనిట్కి అభిమాని బెదిరింపు..
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్ర యూనిట్ కి ఒక అభిమాని బెదిరింపు లేఖ రాశాడు. ప్రస్తుతం..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం నటిస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్' (Game Changer). గత రెండేళ్ల ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూనే వస్తుంది. RRR పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్ కంటే ముందే రామ్ చరణ్.. తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈ ఏడాది తన కొత్త సినిమా 'దేవర' షూటింగ్ ని మొదలుపెట్టుకున్న ఎన్టీఆర్.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు.
కానీ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మాత్రం అసలు షూటింగ్ కి వెళ్లడమే గగనం అయ్యిపోయింది. అంతేకాదు మూవీ నుంచి రిలీజ్ డేట్ లేదా ఒక చిన్న అప్డేట్ ని కూడా మేకర్స్ అభిమానులకు ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతలు పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఆ ఆగ్రహం ఇప్పుడు మరింత శృతిమించింది. ఏకంగా చిత్ర యూనిట్ కి బెదిరింపు లేఖ పంపేవరకు చేరుకుంది.
రామ్ చరణ్ వీరాభిమాని అయిన ఒకరు సోషల్ మీడియాలో ఒక బెదిరింపు నోట్ ని రిలీజ్ చేశాడు. ఆ నోట్ సారాంశం ఏంటంటే.. 'గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ని మరో రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేయకపోతే ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని, దానికి పూర్తి బాధ్యత మూవీ టీందేనని' ఆ అభిమాని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరు.. 'సినిమా అనేది వినోదం మాత్రమే. దానిని జీవితంతో ముడిపెట్టొద్దని' కామెంట్స్ చేస్తున్నారు.
కాగా దర్శకుడు శంకర్ ఈ మూవీతో పాటు కమల్ హాసన్ 'ఇండియన్ 2'ని కూడా తెరకెక్కిస్తున్నాడు. దీంతో కొన్ని రోజులు గేమ్ ఛేంజర్, మరికొన్ని రోజులు ఇండియన్ 2 చేయాల్సి వచ్చింది. అయితే రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసి, ఆర్టిస్టులంతా డేట్స్ ఇచ్చిన తరువాత కమల్ హాసన్ మూవీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. దీంతో గేమ్ ఛేంజర్ కోసం కొందరు ఆర్టిస్టులు ముందుగా ఇచ్చిన డేట్స్ అయ్యిపోయాయి. ఇప్పుడు వారి కాల్షీట్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అందుకనే గేమ్ ఛేంజర్ షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది.
Next Story