Mon Dec 23 2024 06:33:07 GMT+0000 (Coordinated Universal Time)
రామ్చరణ్ కూతురి పేస్ని రివీల్ చేసిన ఫ్యాన్స్..
మెగా వారసురాలు క్లీంకార పేస్ చూపించకుండా చరణ్, ఉపాసన జాగ్రత్తపడుతుంటే.. అభిమానులు క్లీంకార పేస్ ని బయట పెట్టేశారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన వారసత్వం గురించి చెప్పే శుభవార్త కోసం అభిమానులు దాదాపు 10 ఏళ్ళు ఎదురు చూశారు. వారందరి ఎదురు చూపులకు ఈ ఏడాది ఎండ్ కార్డు వేస్తూ మెగా వారసురాలు 'క్లీంకార' మెగా ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది. తన రాకను అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా అభిమానులు పెద్ద పండుగగా జరుపుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ.. వారసురాలు పేస్ ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు.
క్లీంకారతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నప్పటికీ పేస్ కనిపించకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు. అయితే తాజాగా షేర్ చేసిన ఒక ఫొటోలో క్లీంకార పేస్ రివీల్ అయ్యిపోయింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఈ వివాహం ఇటలీ జరగనుంది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి చేరుకుంది. ఇక అక్కడి సెలబ్రేషన్స్ పిక్స్ ని షేర్ చేస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా ఉపాసన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలో మెగా, కామినేని ఫామిలీస్ ఒక స్విమ్మింగ్ పూల్ ముందు నిలబడి ఫోటోకి ఫోజు ఇచ్చారు. ఆ ఫొటోలో కూడా క్లీంకార పేస్ ని చూపించకుండా ఉపాసన లవ్ ఎమోజితో కవర్ చేశారు. అయితే వారందరి ప్రతిబింబం ఎదురుగా ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబంలో క్లీంకార పేస్ కనిపిస్తుంది. దానిని చరణ్ అభిమానులు గమనించారు.
దీంతో క్లీంకార పేస్ ని రివీల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో క్లీంకార పేస్ క్లారిటీగా కనిపించినప్పటికీ.. అది చూసి కూడా మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మరి మెగా వారసురాలి ఫోటోని మీరుకూడా చూసేయండి.
Next Story