Mon Dec 23 2024 08:53:18 GMT+0000 (Coordinated Universal Time)
Game Changer : సాంగ్ మాత్రమే కాదు.. మూవీ రిలీజ్ కూడా 'జరగండి'..
గేమ్ ఛేంజర్ 'జరగండి' సాంగ్ రిలీజ్ ని మాత్రమే కాదు, మూవీ విడుదలను కూడా పక్కకి జరిపేశారట.
Game Changer : ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్టు తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. దీనికి శంకర్ డైరెక్టర్ కావడంతో సినిమా పై మరింత అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ కోసం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చుస్తునారు. అయితే ఈ చిత్రం ఎదురు చూస్తున్న కొద్దీ వెనక్కి వెళ్తుంది. రెండేళ్ల క్రిందట షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీ.. ఇంకా చిత్రీకరణ జరుపుకుంటూనే ఉంది.
శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ 'భారతీయుడు 2' కూడా తెరకెక్కిస్తుండడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ లేటు అవుతూ వస్తుంది. ఈ రెండు సినిమాల్లో శంకర్ మొదటి ప్రాధాన్యత భారతీయుడు 2. అది రిలీజ్ అయిన తరువాత గేమ్ ఛేంజర్ ని విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే భారతీయుడు 2 షూటింగ్ పూర్తి చేసేసిన శంకర్.. దాని అవుట్ పుట్ చాలా ఎక్కువ రావడంతో రెండు పార్టులుగా తీసుకు రావడానికి సిద్ధమయ్యారు.
దీంతో మూడో పార్ట్ కోసం మరిన్ని సీన్స్ చిత్రీకరించడానికి ఫిక్స్ అయ్యారు. ఈక్రమంలోనే గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ని పక్కన పెట్టి భారతీయుడు 3 షూటింగ్ కోసం 40 రోజులు కేటాయించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ని విజయవాడలో జరుపుతున్నారు. ఇక ఈ రెండు సినిమాల రిలీజ్లు విషయానికి వస్తే.. భారతీయుడు 2ని 2024 సమ్మర్కి, పార్ట్ 3ని 2024 క్రిస్ట్మస్కి తీసుకు రాబోతున్నారంటూ చెబుతున్నారు.
ఈ రిలీజ్లు బట్టి చూస్తే.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ 2024లో కూడా రిలీజ్ అవ్వదని అర్ధమవుతుంది. దీంతో అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇక ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన 'జరగండి' సాంగ్ కూడా విడుదల కావడం కావడం లేదట. సాంగ్ రిలీజ్ని, మూవీ విడుదలను డైరెక్టర్ శంకర్ ఇలా పక్కకి జరిపేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story