Mon Dec 23 2024 14:31:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఆర్ఆర్ టీమ్ కు బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు పనిచేసిన వర్కర్స్ కు బంగారం బహుమతిగా ఇచ్చారు. సినిమాకోసం..
ఆర్ఆర్ఆర్ టీమ్ కు బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్ ఆర్ఆర్ఆర్.. విడుదలైన తొలివారంరోజుల్లో రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది. ఇక రెండోవారం కూడా ఆర్ఆర్ఆర్ హవా కొనసాగుతోంది. వీకెండ్ లో రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. సినిమా ఘన విజయం సాధించడంతో.. రాజమౌళి, తారక్, చరణ్ లు సహా.. నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు పనిచేసిన వర్కర్స్ కు బంగారం బహుమతిగా ఇచ్చారు. సినిమాకోసం పనిచేసిన వివిధ శాఖల వారిని ఉదయం అల్పాహారం కోసం పిలిపించి.. ఈ బహుమతి ఇచ్చారు. వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన వారిని, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఇలా మొత్తం 35 మందికి ఒక్కో తులం చొప్పున బంగారు నాణేలను అందించారు. ఆ నాణేలపై రామ్ చరణ్ అని రాసి ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story