Mon Dec 23 2024 08:09:43 GMT+0000 (Coordinated Universal Time)
హాలీవుడ్ అవార్డు నామినేషన్స్‌లో రామ్ చరణ్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ అవార్డు నామినేషన్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) RRR తో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన యాక్టింగ్ తో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ ని కూడా మెస్మరైజ్ చేశాడు. ఇక ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్ హాలీవుడ్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. టాప్ హాలీవుడ్ యాక్టర్స్ పాల్గొనే టీవీ షోలు దగ్గర నుంచి అమెరికన్ యాక్టర్స్ కి అవార్డులు ఇచ్చే గౌరవాన్ని కూడా అందుకున్నాడు.
ఇక 'ఆర్ఆర్ఆర్' తన యాక్టింగ్ నేషనల్ అవార్డు వస్తుందని చాలామంది భావించారు. కానీ ఈసారి కూడా రామ్ చరణ్ నటనకి జాతీయ పురస్కారం దక్కలేదు. దీంతో మెగాపవర్ స్టార్ అభిమానులంతా బాధ పడ్డారు. అయితే తాజాగా ఒక వార్త ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. ప్రముఖ హాలీవుడ్ అవార్డు నామినేషన్స్ లో రామ్ చరణ్ స్థానం దక్కించుకున్నాడు. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ (Pop Golden Awards).. ఇండియాలోని బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఇస్తుంటారు.
ఈక్రమంలోనే గోల్డెన్ బాలీవుడ్ మూవీ, గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్.. ఇలా రెండు క్యాటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తారు. రామ్ చరణ్, అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా.. బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ లో ఎంపిక అయ్యారు. ఇక మూవీ క్యాటగిరీలో ఫర్జి, కాలేజీ రొమాన్స్, రాకెట్ బాయ్స్, RRR, గాన్ గేమ్, అసుర్, పఠాన్, కేరళ స్టోరీ ఎంపిక అయిని.
అలాగే 'నాటు నాటు' (Naatu Naatu) సాంగ్ బెస్ట్ సౌండ్ ట్రాక్ క్యాటగిరీలో హాలీవుడ్ సాంగ్స్ తో కలిపి ఎంపికైంది. ఇక రామ్ చరణ్ ఇలా ఒక ఇంటర్నేషనల్ అవార్డ్స్ నామినేషన్స్ లో కనిపించడం అభిమానులను సంతోష పరుస్తుంది. ప్రస్తుతం ఈ నామినేషన్స్ లిస్ట్ ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. మరి ఈ రేసులో రామ్ చరణ్ అవార్డు గెలుచుకుంటాడా..? లేదా..? అనేది వేచి చూడాలి. నవంబర్ లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.
Next Story