Mon Dec 23 2024 07:30:22 GMT+0000 (Coordinated Universal Time)
రెండేళ్ల తర్వాత భార్యతో వెకేషన్ కి వెళ్లిన చెర్రీ
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్, ప్రమోషన్ల నుంచి చెర్రీకి చిన్న బ్రేక్ దొరికిందట. దాంతో భార్యతో వెకేషన్ కి ప్లాన్ చేశారు.
హైదరాబాద్ : రాజమౌళితో సినిమా అంటే.. ఏ హీరో అయినా ఏళ్ల తరబడి డేట్స్ ఆయనకే ఫిక్స్ అయిపోవాల్సిందే. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. భారీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్, ప్రమోషన్ల నుంచి చెర్రీకి చిన్న బ్రేక్ దొరికిందట. దాంతో భార్యతో వెకేషన్ కి ప్లాన్ చేశారు.
"ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత వెకేషన్ కి వెళ్తున్నాం. థ్యాంక్యూ మిస్టర్ C" అని చరణ్ భార్య ఉపాసన ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే.. చెర్రీ దర్శకుడు శంకర్ తో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు. వరుస షూటింగులతో బిజీ అయిన రామ్ చరణ్ కు కాస్త విరామం దొరకడంతో భార్య ఉపాసనతో చెర్రీ వెకేషన్ ప్లాన్ చేశారు. ఇద్దరూ కలిసి జర్నీ చేస్తున్న ఓ ఫొటోను ఉపాసన నెటిజన్లతో పంచుకున్నారు. కాగా.. వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారన్న విషయం మాత్రం వారు వెల్లడించలేదు.
Next Story