Sat Apr 05 2025 04:48:39 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాసన పాదాలకు మసాజ్ చేసిన రామ్ చరణ్
సూపర్‌స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని తరచుగా అంటూ

సూపర్‌స్టార్ రామ్ చరణ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని తరచుగా అంటూ ఉంటారు. ఇప్పుడు, ఒక వైరల్ వీడియోలో.. రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెల పాదాలకు మసాజ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ఇంటర్నెట్ లో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఇంటర్నెట్ ఈ జంటను చూసి 'కపుల్ గోల్స్' అంటూ ప్రశంసించారు. వైరల్ వీడియోలో.. ఉపాసన రామ్ చరణ్ ఒళ్ళో తన పాదాలను ఉంచింది. ఆ సమయంలో రామ్ చరణ్ ఆమె పాదాన్ని సున్నితంగా మసాజ్ చేయడం కనిపిస్తుంది. ఎంతో మంది నెటిజన్లు రామ్ చరణ్ కు బెస్ట్ హజ్బెంట్ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల వివాహానికి ముందు జరిగే వేడుకలకు హాజరయ్యేందుకు ఈ జంట జామ్‌నగర్‌కు విమానంలో వెళ్లారు. మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ ఈ జంటకు సంబంధించిన కొన్ని వీడియోలు, స్నాప్‌లను పంచుకున్నారు. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామాలో కనిపించబోతున్నారు.
Next Story