Mon Dec 23 2024 07:21:04 GMT+0000 (Coordinated Universal Time)
రామ్చరణ్, ధోనీ ఎందుకు కలుసుకున్నారు..?
రామ్చరణ్, ధోనీ కలవడానికి గల కారణం ఏంటి..? ధోనీ నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడా..?
టాలీవుడ్ మిస్టర్ కూల్ రామ్ చరణ్, కెప్టెన్ కూల్ ధోనీ.. ఒకే ఫ్రేమ్ లో కనిపించి చాలా ఏళ్ళు అయ్యింది. ఎప్పుడో 2009లో ఈ ఇద్దరు కలిసి ఒక యాడ్ లో కలిసి నటించారు. ఆ తరువాత మళ్ళీ ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఎప్పుడు కనిపించలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఉన్న ఒక పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కూడా ఈ ఫోటోని షేర్ చేశాడు. ఇండియన్ ప్రైడ్ అయిన ధోనీని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ చరణ్ పేర్కొన్నాడు.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలవడానికి గల కారణం ఏంటి..? అని అందరిలో సందేహం నెలకుంది. ఇటీవల ధోనీ సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. 'ధోనీ ఎంటర్టైన్మెంట్స్' అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలోనే ఇటీవల తమిళంలో ఒక సినిమాని నిర్మించాడు. త్వరలోనే తెలుగులో కూడా సినిమా నిర్మిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ ని కలవడం.. హాట్ టాపిక్ గా మారింది.
ధోనీ నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడా..? అనే సందేహం మొదలైంది. అయితే వీరిద్దరి భేటీ మధ్య కారణం సినిమా కాదని తెలుస్తుంది. మళ్ళీ మరోసారి వీరిద్దరూ ఒక యాడ్ కోసం పని చేయబోతున్నారట. అందుకోసమే రామ్ చరణ్.. ముంబై వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో వీరిద్దరూ కలిసి 'పెప్సీ యాడ్'లో నటించారు. మరి ఇప్పుడు ఏ యాడ్ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారో చూడాలి.
ఇక ధోనీ, రామ్ చరణ్ చాలా ఏళ్ళ తరువాత ఒకే ఫ్రేమ్ లో కనిపించడడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గతంలో వీరిద్దరూ చేసిన పెప్సీ యాడ్ ని మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఆ యాడ్ ఆరెంజ్ సమయంలోనిది కావడంతో రామ్ చరణ్ ఆ మూవీలోని లుక్స్ లో కనిపిస్తాడు.
Next Story