Mon Dec 23 2024 04:40:10 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్, చరణ్‌కి కొత్తగా వచ్చిన గౌరవం కాదు..
ఆల్రెడీ అందుకున్న గౌరవాన్ని ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ స్వీకరించారు తప్ప.. ఇది ఏదో కొత్త గౌరవం కాదు.
‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’ సభ్యత్వాని.. గత నెలలో ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని వైరల్ చేస్తూ ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఇది ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు అందిన మరో గౌరవంగా చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆస్కార్.. అకాడమీ కొత్త సభ్యుల లిస్టుని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, డిఒపి సెంథిల్ కుమార్, కరణ్ జోహార్, షౌనక్ సేన్‌తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.
అయితే ఇక్కడ అందరు పొరబాటు పడుతున్న విషయం ఏంటంటే.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లిస్ట్, అకాడమీ కొత్త సభ్యుల లిస్టు వేరువేరు అనుకుంటున్నారు. ఆ రెండు ఒకటే. ఈ ఏడాది అకాడమీ.. తమ సభ్యుల లిస్టులోకి 398 మంది కొత్త మెంబెర్స్ కి ఆహ్వానం పలికింది. ఇలా కొత్తగా ఆహ్వానం అందుకున్నవారంతా దానిని స్వీకరిస్తే.. వారు అకాడమీ సభ్యులుగా అర్హత పొందుతారు. అలా సభ్యులు అయిన వారు యాక్టర్ అయితే ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో, సంగీత దర్శకుడు అయితే మ్యూజిక్ డైరెక్టర్ బ్రాంచ్‌లో.. ఇలా ఆయా క్రాఫ్ట్ కి తగ్గట్టు సభ్యత్వం అందుకుంటారు. ఇక సభ్యత్వం పొందిన వారంతా.. తమ ఓటు హక్కుతో నామినేషన్స్ లో ఉన్న వారికీ ఓటు వేస్తారు.
ఇక కొత్తగా సభ్యత్వం అందుకున్న కీరవాణి, చంద్రబోస్, సాబు సిరిల్, సెంథిల్ కుమార్, కరణ్ జోహార్, షౌనక్ సేన్.. తమకి వచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి తమ ఓటుని ఉపయోగించుకునే హక్కుని పొందారు. ఇక వీరికి ఆహ్వానం పలుకుతూ అకాడమీ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కంటే ముందే పోస్టులు వేసింది. రీసెంట్ ఎన్టీఆర్, చరణ్ కూడా అకాడమీ ఆహ్వానం స్వీకరించడంతో వారిని ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ మెంబర్స్ గా ప్రకటిస్తూ ఆహ్వానం పలికింది. ఆల్రెడీ అందుకున్న గౌరవాన్ని ఇప్పుడు మన స్టార్స్ స్వీయకరించారు తప్ప.. ఇది ఏదో కొత్త గౌరవం కాదు. కాగా ఈ ఇయర్ ఇండియా నుంచి ఆస్కార్ కి ‘2018’ మలయాళ మూవీ నామినేషన్స్ కోసం వెళ్ళింది. మరి ఈ చిత్రం షార్ట్ లిస్టులో ప్లేస్ దక్కించుకుంటుందో లేదా చూడాలి.
Next Story