Sat Dec 21 2024 10:30:41 GMT+0000 (Coordinated Universal Time)
వైట్ అంట్ వైట్ లో.. పొలిటీషియన్ గా రామ్ చరణ్
గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని చేతులు మడతెట్టి సైకిల్ తొక్కుతున్న చరణ్ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్ : RRR సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రామ్ చరణ్ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే జోష్ తో శంకర్ సినిమా షూటింగ్ లోనూ జాయిన్ అయ్యాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది. ఇప్పటి వరకూ సినిమా టైటిల్ ఫిక్స్ కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ ఫొటో లీకైంది. ఆ ఫొటోలో వైట్ అండ్ వైట్ లో అచ్చం పొలిటీషియన్ లా కనిపిస్తున్నాడు చెర్రీ.
గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని చేతులు మడతెట్టి సైకిల్ తొక్కుతున్న చరణ్ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో ఖచ్చితంగా శంకర్ సినిమాలోదేనని అంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా రెండు షేడ్స్ లో నటించనున్నట్టు తెలుస్తోంది. 1980ల నాటి రాజకీయ నాయకుడిగా చరణ్ కనిపిస్తాడని, దానికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు లీకైందని అంటున్నారు. తండ్రి బాటలోనే ఐఏఎస్ గా ఉన్న తనయుడు కూడా రాజకీయ నాయకుడిగా మారతాడట. ఈ కథంతా నిజమో కాదో.. పక్కన పెడితే,, లీకైన ఫొటోని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
Next Story