Thu Dec 19 2024 23:52:53 GMT+0000 (Coordinated Universal Time)
RC16లో ‘కోడి రామ్మూర్తి నాయుడు’గా రామ్‌చరణ్.. ఎవరు ఈ వ్యక్తి..
RC16లో రామ్ చరణ్ ‘కోడి రామ్మూర్తి నాయుడు’ పాత్రలో నటించబోతున్నారట. అసలు ఎవరు ఈ వ్యక్తి..
RC16 : రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్స్‌గా బుచ్చిబాబు తెరకెక్కించబోతున్న చిత్రం 'RC16'. ఈ మూవీ నిన్ననే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ మూవీ శ్రీకాకుళం గోదావరి ప్రాంతం నేపథ్యంతో సాగబోతుందని ఇప్పటికే మేకర్స్ తెలియజేసారు. అయితే స్టోరీ లైన్ ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. దీని గురించి ఫిలిం వర్గాల్లో ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్లయోధుడు ‘కోడి రామ్మూర్తి నాయుడు’ లైఫ్ స్టోరీతో బయోపిక్ గా రూపొందబోతుందని టాక్ వినిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈ మల్లయోధుడు.. బ్రిటిష్ రూలింగ్ సమయంలో ఇండియా నుంచి లండన్ వరకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 'కలియుగ భీమ' అనే బిరుదుని అందుకున్న కోడి రామ్మూర్తి.. ఛాతి పై పెద్ద ఏనుగులను ఎక్కించుకోవడం, భారీ వాహనాలను లాగడం, ఇనుప గొలుసులను కూడా దారంలా తెప్పేయడం.. వంటి ప్రదర్శనలతో ఎంతో పేరు గాంచారు. ఈయన టేలంట్ గురించి తెలుసుకున్న బ్రిటిష్ రాజదంపతులు.. కోడి రామ్మూర్తి ప్రత్యేకంగా లండన్ బకింగ్హమ్ ప్యాలెస్‌కి పిలిపించుకొని ఆయన ప్రదర్శన చూసారా.
ఆ ప్రదర్శనకు ఫిదా అయిన రాజదంపతులు.. కోడి రామ్మూర్తిని ‘ఇండియన్ హెర్క్యులస్’ అంటూ సత్కరించారు. అలాగే ఆయనకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఇలా లండన్ రాజదంపతుల నుంచి సత్కారం అందుకున్న మొదటి భారతీయుడిగా కోడి రామ్మూర్తి నాయుడు పేరు సంపాదించుకున్నారు. లండన్ మాత్రమే కాదు, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, చైనా, జపాన్, బర్మా వంటి దేశాల్లో కూడా ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. బర్మాలో ప్రదర్శన కోసం వెళ్ళినప్పుడు ఆయన పై హత్య ప్రయత్నం జరిగిందట. కానీ ఆయన అది తప్పించుకొని ఇండియా చేరుకున్నారు.
కోడి రామ్మూర్తి నాయుడు గొప్ప దేశభక్తుడు కూడా. ఆయన సంపాదించిన దానిలో చాలావరకు జాతీయోద్యమాలకు దానం చేసేవారట. అప్పటి స్వతంత్ర పోరాటాలకు ఆయన ఎన్నో సహకారాలు అందించారట. అలాగే తన చుట్టూ ఉన్న ప్రజలకు కూడా ఎన్నో సాయిలు చేసేవారట. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రని రామ్ చరణ్ పోషించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.
Next Story