Mon Dec 23 2024 14:09:13 GMT+0000 (Coordinated Universal Time)
నేను ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లేది అందుకే : రామ్ చరణ్
ఒక ఫ్యాన్ గా వెళ్తున్నాను అని చెప్పారు. అయితే.. ఆస్కార్ ఎంతో మంది వస్తారు.. వారిలో ఎవరిని చూసేందుకు మీరు ఎదురుచూస్తున్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలో వరుసగా అరుదైన గౌరవాలను దక్కించుకుంటున్నాడు. ఇటీవల అక్కడ జరిగిన HCA అవార్డ్స్ కి ప్రెజెంటర్గా, గుడ్ మార్నింగ్ అమెరికాకి గెస్ట్గా.. చరణ్ హాజరయ్యారు. ఇప్పటికీ ప్రముఖ పాపులర్ వేదికలు ఆయనకు ఆతిథ్యమిస్తున్నాయి. తాజాగా.. మరో పాపులర్ అమెరికన్ టాక్ షో కి కూడా రామ్ చరణ్ ఫస్ట్ ఇండియన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ‘ఎంటర్టైన్మెంట్ టునైట్’ అనే టాక్ షోలో పాల్గొన్న రామ్ చరణ్.. పలు ఆసక్తికర విషయాలను హాలీవుడ్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఈ షో లో యాంకర్ రామ్ చరణ్ ను ఆస్కార్ అందుకునేందుకు మీరు రెడీగా ఉన్నారా ? అని ప్రశ్నించగా.. అందుకు చెర్రీ బదులిస్తూ.. అవార్డుకోసం సిద్ధంగా ఉన్నానా ? లేదా? అన్న విషయం నాకే తెలియదు. ఎందుకంటే నాకు కొంచెం భయంగా, మరికొంత ఆసక్తిగా కూడా ఉంది. నిజానికి నేను ఆస్కార్ అవార్డుల వేడుకకు ఒక యాక్టర్ గా వెళ్లట్లేదు. ఒక ఫ్యాన్ గా వెళ్తున్నాను అని చెప్పారు. అయితే.. ఆస్కార్ ఎంతో మంది వస్తారు.. వారిలో ఎవరిని చూసేందుకు మీరు ఎదురుచూస్తున్నారు అని మరో ప్రశ్న వేయగా.. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కర్ని చూడడానికి. అయితే కేట్ బ్లాంచెట్ అండ్ టామ్ క్రూజ్ ని మాత్రం ఖచ్చితంగా చూడాలని అనుకుంటున్నానని చరణ్ బదులిచ్చాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం మార్చి 12 రాత్రి ఆస్కార్ అవార్డుల పురస్కారం జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ వేడుక మొదలుకానుంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
Next Story