Mon Dec 23 2024 11:49:24 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవిగారు మా నాన్నగారిలా లేరు : రామ్ చరణ్ తేజ్
రంగస్థలం హిట్ ఇచ్చిన నిర్మాతలే.. తన తండ్రికి కూడా వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. రూ.250 కోట్ల మార్క్ వైపుగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో హనుమకొండలో 'వీరయ్య విజయవిహారం' పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్టుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. రంగస్థలం హిట్ ఇచ్చిన నిర్మాతలే.. తన తండ్రికి కూడా వీరయ్యతో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నాడు. ఆ నిర్మాతలు ఎంతో ప్యాషన్ తో ఇండస్ట్రీకి రావడం వల్లే వరుస విజయాలు వస్తున్నాయని చరణ్ అన్నాడు.
సినిమాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కినట్టుగా తీశారని డైరెక్టర్ బాబీపై పొగడ్తల వర్షం కురిపించారు. నిజానికి "సినిమాలో చిరంజీవిగారు మా నాన్నగారిలా లేరు.. నాకు బ్రదర్ లా ఉన్నారు. చిరంజీవిగారి ఫంక్షన్ కి చీఫ్ గెస్టులు అవసరం లేదు. నేను కూడా ఆయన అభిమానిగానే నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని వచ్చానంతే. రవితేజ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా నాకు బాగా నచ్చింది. దేవిశ్రీ ఈ సినిమా కోసం మూడు అదిరిపోయే పాటలు ఇచ్చాడు. నా సినిమాకి కూడా మంచి పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నాను" అన్నాడు రామ్ చరణ్. 'వాల్తేరు వీరయ్యకి ఇంతటి మెమరబుల్ హిట్ ను ఇచ్చినందుకు అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Next Story