Mon Dec 23 2024 15:55:35 GMT+0000 (Coordinated Universal Time)
ముంబైలో ప్రత్యక్షమైన రామ్ చరణ్.. సోదరితో అక్కడేం చేస్తున్నట్లు ?
శ్రీజ విడాకులపై వార్తలొస్తున్న నేపథ్యంలో.. మెగా ఫ్యామిలీ ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదు. ఇప్పుడు చరణ్ తన సోదరితో కలిసి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ప్రత్యక్షమయ్యారు. చరణ్ తో పాటు సోదరి శ్రీజ, వారి పెంపుడు కుక్క రైమ్ కూడా కనిపించాయి. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో చెర్రీ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. లేత గోధుమరంగు టీ-షర్ట్‌లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించాడు. అయితే చరణ్.. శ్రీజతో కలిసి ముంబైకి ఎందుకు వెళ్లాడు ? అక్కడ ఏం చేస్తున్నాడు ? అన్న విషయాలపై క్లారిటీ రాలేదు. కానీ.. ఇటీవలే శ్రీజ.. తన భర్త కల్యాణ్ నుంచి విడిపోయిందని, అందుకే సోషల్ మీడియాలో తన యూజర్ నేమ్ ను మళ్లీ శ్రీజ కొణిదల గా మార్చిందని, కల్యాణ్ దేవ్ ను అన్ ఫాలో చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి.
శ్రీజ విడాకులపై వార్తలొస్తున్న నేపథ్యంలో.. మెగా ఫ్యామిలీ ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదు. ఇప్పుడు చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో కనిపించడంతో.. శ్రీజ విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. నెట్టింట్లో ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాగా.. చరణ్ ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ విడుదలల కోసం వేచి చూస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ విడుదలపై చెర్రీ గంపెడాశలు పెట్టుకున్నాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో.. సినిమాను విడుదల చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు దర్శకుడు జక్కన్న.
Next Story