Mon Dec 23 2024 05:13:22 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో Mr.C బేబీమూన్ ట్రిప్.. భార్య వెనుక తిరుగుతూ..
ఇందుకు సంబంధించి బేబీమూన్ ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చరణ్ ఓపెన్ టాప్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారన్న విషయం తెలిసిందే. మరో వారంరోజుల్లో అక్కడ జరగబోయే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం RRR టీమ్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. చరణ్ తో పాటు భార్య ఉపాసన కూడా అమెరికాలోనే ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బేబీ మూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. భార్యతో కలిసి రామ్ చరణ్ అమెరికాను చుట్టేస్తున్నాడు.
ఇందుకు సంబంధించి బేబీమూన్ ట్రిప్ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చరణ్ ఓపెన్ టాప్ కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించాడు. షాపింగ్, డిన్నర్, సైట్ సీయింగ్తో ఇద్దరూ బిజీగా, హ్యాపీగా గడిపేశారు. ఇక RRR విషయానికొస్తే.. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న RRR 5 హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ అవార్డులు, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది. ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో.. నాటు నాటు పాటతో ఆస్కార్ కు నామినేట్ అయింది. మార్చి 13న ఈ అవార్డుల వేడుక జరగనుంది.
Next Story