మురిసిపోతున్న మెగా, కామినేని కుటుంబాలు
రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి
రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో మెగా కుటుంబం, కామినేని కుటుంబంలో ఆనందం మిన్నంటింది. మెగా ప్రిన్సెస్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరు కుటుంబ సభ్యులు నేటి ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి వెళ్లి రామ్ చరణ్-ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలపనున్నారు. 2012లో రామ్చరణ్ ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని కుటుంబాలు గతేడాది నవంబర్ 12న వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితమే ఉపాసన సీమంతం ఘనంగా నిర్వహించారు. పెళ్లయిన నాటి నుంచీ అత్తమామలతోనే ఉంటున్న రామ్చరణ్, ఉపాసన తాము గత కొంత కాలంగా విడిగా ఉంటున్నామని ఇటీవల ప్రకటించారు. బిడ్డ పుట్టాక మళ్లీ అత్తమామలతోనే ఉంటామని తెలిపారు.