Sat Dec 21 2024 02:14:03 GMT+0000 (Coordinated Universal Time)
బన్నీకి ప్రేమతో చరణ్-ఉప్సి.. అల్లు అర్జున్ పోస్ట్ చూశారా..?
అల్లు అర్జున్ కి రామ్ చరణ్ నుంచి సరైన అభినందన రాలేదని, వారి మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్ సైట్స్ లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. అయితే తాజాగా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప (Pushpa) సినిమాకి నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా టాలీవుడ్ కి మొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని తీసుకు తీసుకు రావడంతో అల్లు-మెగా వారి ఇంటిలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా పండుగా వాతావరణం కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, అల్లు అర్జున్ కి రామ్ చరణ్ (Ram Charan) నుంచి సరైన అభినందన రాలేదని, వారి మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్ సైట్స్ లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి.
ఇక ఇవన్నీ చూసిన మెగాభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా బన్నీ చేసిన ఒక పోస్ట్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వారి మధ్య గ్యాప్ వచ్చింది అనేది కేవలం రూమరే అని తెలిసి ఖుషీ ఫీల్ అవుతున్నారు. రామ్ చరణ్ అండ్ ఉపాసన (Upasana) అల్లు అర్జున్ ని అభినందిస్తూ.. పూల బొకేతో పాటు ఒక గ్రీటింగ్ కార్డు పంపించారు. బన్నీకి ప్రేమతో అంటూ చరణ్-ఉప్సి పంపించిన గిఫ్ట్ ని అల్లు అర్జున్ తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. "థాంక్యూ సో మచ్ చరణ్, ఉపాసన. మీ బహుమతి హృదయానికి టచ్ అయ్యింది" అంటూ పేర్కొన్నాడు.
ఈ స్టోరీని స్క్రీన్ షాట్ తీసి అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ.. చరణ్ అండ్ బన్నీ మధ్య గ్యాప్ రూమర్ మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి తన సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అలాగే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కొడుకు పెళ్ళికి వెళ్లలేకపోవడంతో ఇంటికి వెళ్లి.. కొత్తజంటకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక బ్రహ్మానందం ఫ్యామిలీ కూడా అవార్డు అందుకున్నందుకు బన్నీని కూడా సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Next Story