Fri Dec 20 2024 12:35:03 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : మహారాష్ట్ర సీఎం ఇంటిలో రామ్చరణ్.. ఎందుకు కలిశారు..?
మహారాష్ట్ర సీఎం ఇంటిలో రామ్చరణ్. హిందూ సాంప్రదాయ పద్ధతిలో చరణ్ దంపతులకు షిండే దంపతుల ఆత్మీయ స్వాగతం. అసలు ఎందుకు కలిశారు?
Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నా.. ఎక్కువ శాతం బాలీవుడ్ లోనే కనిపిస్తున్నారు. యాడ్ షూట్స్ అంటూ, బాలీవుడ్ ప్రముఖులతో మీటింగ్స్ అంటూ.. ఎక్కువుగా ముంబైలోనే ఉంటున్నారు. ఇక చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్తుండడంతో.. ముంబైలోని పలు పుణ్యక్షేత్రాలను సతీసమితంగా దర్శించుకుంటూ వస్తున్నారు.
దీంతో బాలీవుడ్ ఆడియన్స్ కి తరుచు కనిపిస్తూ రామ్ చరణ్ ముంబై వీధుల్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ మెగా కపుల్.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేని కలుసుకున్నారు. రామ్ చరణ్ దంపతులకు ఏక్నాథ్ షిండే కుటుంబం ఆత్మీయ స్వాగతం పలికారు. ఏక్నాథ్ షిండే ఫ్యామిలీలోని ఆడపడుచు.. హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉపాసనకి బొట్టు పెట్టి గౌరవ ఆతిథ్యం ఇచ్చారు. రామ్ చరణ్కి ఏక్నాథ్ షిండే వినాయక విగ్రహాన్ని ఇచ్చి గౌరవించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్, ఉపాసన కూడా ఈ మీటింగ్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. "గౌరవనీయులు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారికి, మహారాష్ట్ర జనానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఆత్మీయమైన ఆతిథ్యం ఇచ్చినందుకు" అంటూ పేర్కొన్నారు.
అయితే ఈ మీటింగ్ ఎందుకు అన్నది మాత్రం తెలియజేయలేదు. దీంతో అసలు రామ్ చరణ్ ఎందుకు ఆయనని కలిశారు. అసలు పక్క రాష్ట్ర సీఎం ఇంటికి వెళ్లి, వాళ్ళ ఆతిథ్యం తీసుకునేంత ఏం జరిగింది అంటూ అభిమానులు తెగ ప్రశ్నలు వేసుకుంటూ ఉత్తేజం అవుతున్నారు. మరి ఈ మీటింగ్ వెనుక అసలు కథ ఏంటో తెలియాలంటే కొంచెం వేచి చూడాల్సిందే.
కాగా ఈ వీడియోలు, ఫోటోలు చూసిన చరణ్ అభిమానులు.. తండ్రి మించిన తనయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నవాడే.. ఇప్పుడు ప్రశంసలు, గౌరవాలు అందుకుంటున్నాడు అంటూ గర్వంగా చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story