Mon Dec 23 2024 06:08:39 GMT+0000 (Coordinated Universal Time)
తమ్ముడి పెళ్లి పనులు కోసం ఇటలీకి రామ్ చరణ్..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి పనులు చూసుకోవడానికి రామ్ చరణ్, ఉపాసన ఇటలీ బయలుదేరారు.
టాలీవుడ్ వెండితెర జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. నిజ జీవితంలో కూడా ఒకటి కాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట జూన్ లో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో వెడ్డింగ్ ఫెస్టివల్ ని గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఇక ఈ పెళ్లి పనులు అన్నిటిని వరుణ్ తేజ్.. అన్నావదినలు అయిన రామ్ చరణ్ ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
ఈ మెగా పెళ్లి వేడుకకు ఇటలీ వేదిక కానుంది. అక్కడి టుస్కానీ నగరంలోని ఒక హోటల్ లో ఈ వివాహ వేడుక ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇక అక్కడి పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి.. అందరికంటే ముందు రామ్ చరణ్ జంట ఇటలీ పయనమయ్యారు. మెగా వారసురాలు క్లీంకారతో కలిసి రామ్ చరణ్, ఉపాసన.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇటలీ బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ పెళ్లి వేడుకకు మెగా, అల్లు కుటుంబసభ్యులు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరుకాబోతున్నారని తెలుస్తుంది. ఇందుకోసం రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి, మెగా హీరోలందరూ తమ షూటింగ్స్ కి బ్రేక్ చెప్పేశారట. అయితే అందరిలో ఒక సందేహం నెలకుంది. ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా..? లేదా..? ప్రస్తుతం పవన్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో బిజీగా ఉన్నాడు.
ఇలాంటి సమయంలో దేశం దాటి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదిస్తాడా..? అనేది చూడాలి. కాగా జూన్ లో హైదరాబాద్ లో జరిగిన నిశ్చితార్థం వేడుకకు పవన్ హాజరయ్యి.. వరుణ్-లావణ్యకి తన బ్లేసింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి డేట్ గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. కానీ నవంబర్ ఫస్ట్ వీక్ లో ఈ వివాహం జరగనుందని ఫిలిం వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి.
Next Story