Thu Dec 26 2024 14:00:41 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడు మాత్రం ఎంతో భావోద్వేగానికి గురయ్యా: రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టింది. ఉపాసనను డిశ్చార్జ్ చేయడంతో, రామ్ చరణ్ ప్రెస్ మీట్ పెట్టాడు. నా కూతురుకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన అందరికీ చాలా థాంక్స్. పాప, ఉపాసన హెల్తీగా ఉన్నారని.. మీ అందరికీ థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. త్వరలోనే నాపాపకు నామకరణం చేస్తాం, నేను ఉపాసన, ఆల్రెడీ పాపకు ఒక పేరు అనుకున్నాం.. 13వ రోజు లేదా,21 రోజు అఫీషియల్గా పేరు అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. చరణ్ మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఇద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. మంచి వైద్య బృందం ఉందని, ఎలాంటి సమస్య లేదని, ఎలాంటి భయం లేదని అన్నారు. అభిమానులు చేసిన ప్రార్థనలు చాలా గొప్పవని చెప్పారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుందని అన్నారు. బిడ్డకు అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు.
కూతురుకి ఎవరి పోలికలు వచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా అన్నీ నాన్న పోలికలే అని చెప్పారు. బిడ్డను తొలిసారి చూసినప్పుడు అందరు తండ్రుల మాదిరే తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. అందరిలానే ఓ తండ్రిగా నాకు పాప పుట్టడం సంతోషాన్ని కలిగించిందని రామ్ చరణ్ అన్నారు. మెగా కుటుంబంలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టడంతో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రసవం తర్వాత ఉపాసన ఈరోజు హస్పిటల్ నుంచి డిచార్జ్ అయ్యారు.
Next Story