Mon Dec 23 2024 02:26:08 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : రామ్చరణ్ ధరించిన వాచ్ ఖరీదు తెలుసా..?
వరుణ్, లావణ్య పెళ్ళిలో రామ్చరణ్ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని టస్కనీ నగరంలో ఈ పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 1 రాత్రి గం.7:18 నిమిషాలకు వరుణ్, లావణ్య మేడలో వేద మంత్రాల సాక్షిగా మూడుముళ్లు వేశాడు. ఇక పెళ్లికి మెగా అండ్ అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి, ఉపాసన ఫ్యామిలీ, బంధుమిత్రులు, పలువురు ఇండస్ట్రీ వ్యక్తులు కూడా హాజరయ్యారు.
సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ, పెళ్లి, రిసెప్షన్ అంటూ మూడురోజులు పాటు ఘనంగా జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు అన్ని నెట్టింట ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోల్లో మెగా హీరోలంతా కలిసి ఉన్న ఫోటో, మెగా బ్రదర్స్ పిక్, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ఫోటో.. బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాబాయ్-అబ్బాయి పిక్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది.
ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. సింపుల్ గా ఉన్న ఇద్దరి లుక్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈక్రమంలోనే అభిమానులను రామ్ చరణ్ ధరించిన హ్యాండ్ వాచ్ ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ ధర ఎంత ఎంతో ఉంటుందో అని తెలుసుకోవడానికి గూగుల్ మొత్తం సెర్చ్ చేసి.. ఫైనల్లీ దాని ఖరీదు ఎంతో తెలియజేశారు. రామ్ చరణ్ ధరించిన వాచ్ బ్రాండ్ మోడల్.. 'పెటక్ ఫిలిప్పీ' అని చెబుతున్నారు.
దాని ధర 285,000 డాలర్స్ అని తెలియజేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.2 కోట్ల 85 లక్షల. ఈ ధర తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం చేతుకు పెట్టుకునే వాచ్ ఖరీదు ఇంతా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా రామ్ చరణ్ కి హ్యాండ్ వాచ్స్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. షాపింగ్ అంటే ముందుగా వాచ్స్ మీదకే చరణ్ చూపు వెళ్తుందట. ఇప్పటికే తన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి.
Next Story