Mon Dec 23 2024 13:37:50 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి తన ఉదారతను చాటుకున్న ఉపాసన
తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకుంది ఉపాసన. ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా ? తన చెవి కమ్మలను..
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత హుందాగా కనిపిస్తారో.. అంతే హుందాగా దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉపాసన ముందుంటారు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకుంది ఉపాసన. ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా ? తన చెవి కమ్మలను దోమకొండ ట్రస్టుకు విరాళంగా ఇచ్చేశారు. టాటా గ్రూప్ కు చెందిన ప్రీమియం బ్రాండ్ నగల సంస్థ జోయా కొత్త స్టోర్ ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేయగా.. ఆ షోరూమ్ ను ఉపాసన కొణిదెల ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపాసన స్టోర్ ఓపెనింగ్ కు తీసుకున్న పారితోషికం మొత్తాన్నీ దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చేశారు. దానితోపాటు తన లేటెస్ట్ మోడల్ చెవి కమ్మలను కూడా ఉపాసన దోమకొండ ట్రస్టుకు అందించారు. ఈ ట్రస్టు అణగారిన మహిళల అభ్యున్నతి, ఆర్థిక సుస్థిరత, సాధికారత కోసం కృషి చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. టాటాల ఆధ్వర్యంలోని జోయా కొత్త స్టోర్ ను లాంచ్ చేయడం సంతోషదాయకమని పేర్కొన్నారు. అరుదైన, కాలాతీత ఆభరణాలకు జోయా పెట్టింది పేరని కితాబిచ్చారు. దోమకొండ ట్రస్టుకు సహాయ సహకారాలు అందిస్తున్న జోయా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story