Mon Dec 23 2024 07:40:31 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంలో మెగా కోడలు ఉపాసన.. అసలేం జరిగింది ?
నిత్యం ఏదోక సేవా కార్యక్రమం చేస్తూ.. నలుగురిచేత ప్రశంసలు అందుకునే మెగా కోడలు ఉపాసన.. ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి
నిత్యం ఏదోక సేవా కార్యక్రమం చేస్తూ.. నలుగురిచేత ప్రశంసలు అందుకునే మెగా కోడలు ఉపాసన.. ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ అందుకు కారణమయింది. హీరో రామ్ చరణ్ సతీమణి అయిన ఉపాసన.. రిపబ్లిక్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఏముంది ఆ పోస్ట్ లో.. ఉపాసన ఏం రాసింది ? అని ఆలోచిస్తున్నారా ? మీరే చూడండి.
జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన తన ఫేస్బుక్ పేజీలో ఒక ఆలయ గోపురం ఫోటోను షేర్ చేసింది. గుడి గోపురంపై ఉన్న దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్యులు నిల్చున్నట్లుగా ఆ ఫొటోను ఎడిట్ చేశారు. అయితే.. గుడి గోపురంపై నిల్చుని ఉన్నవారిపై తాను, తన భర్త చరణ్ కూడా ఉన్నారని ఉపాసన రాసుకొచ్చింది. ఆ ఫోటో తనకు బాగా నచ్చిందని, అది ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ డైరెక్ట్ గా తనకు మెసేజ్ చేస్తే.. అభినందించాలని ఉందని తెలిపారు. అంతే.. అది చూసిన నెటిజన్లకు కోపం చిర్రెత్తుకొచ్చింది. ఏంటిది.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఫోటోను ఉపాసన షేర్ చేయడమే కాకుండా.. ఆర్టిస్ట్ ను అభినందించడం ఏమీ బాగాలేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Also Read : "ఏపీ సేవా" పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్
Next Story