Mon Dec 23 2024 04:29:16 GMT+0000 (Coordinated Universal Time)
మొన్నేమో అంత రచ్చ చేసిన వర్మ.. ఇప్పుడు రాజీ కుదిరిందట
రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో.. ఎలాంటి సినిమా గురించి ప్రకటిస్తాడో.. ఏ వివాదంలో వేలు పెడతాడో ఆయనకే తెలియదు.
రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో.. ఎలాంటి సినిమా గురించి ప్రకటిస్తాడో.. ఏ వివాదంలో వేలు పెడతాడో ఆయనకే తెలియదు. కొద్దిరోజుల కిందట రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! తన సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలు సృష్టించి అడ్డంగా మోసం చేశారు అంటూ రాంగోపాల్ వర్మ నిర్మాతలు నట్టికుమార్, క్రాంతి లపై పంజాగుట్ట స్టేషన్ లో కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో నట్టికుమార్ ఆర్జీవి ఒక 420. ఎప్పుడూ తప్పుడు కేసులు పెడుతూ ఉంటాడు. కానీ నా పిల్లలు జోలికి వస్తే వదిలిపెట్టను. ప్రస్తుతం కోర్టులో వివాదం నడుస్తోంది ఆర్జీవి జీరో అయిపోయాడని కామెంట్లు చేశారు నట్టికుమార్.
నిర్మాత నట్టి కుమార్, ఆయనకు మారుడు క్రాంతి, కుమార్తె కరుణ కొన్ని సినిమాలకు సంబందించి ఆర్ధిక లావాదేవీల విషయంలో రాంగోపాల్ వర్మతో వివాదం కొనసాగుతూ ఉండగా.. వర్మ తాము ఫ్రెండ్స్ అయిపోయామని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ. నట్టి కుమార్, తాను కలిసిపోయామంటూ ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంత వరకు తాము అన్నుకున్నవన్నీ తూచ్ అనేస్తూ ఈ వీడియోలో మాట్లాడారు ఆర్జీవీ. తామిద్దరం కలిసి పోయామని, ఇరువురం పెట్టుకున్న కేసులన్నీ వాపస్ తీసుకుంటున్నామని చెప్పారు. ఇక వర్మ పక్కనే నట్టికుమార్ సైతం నవ్వుతూ కనిపించారు. తామిద్దరం కలిసి పోయామని, ఇరువురం పెట్టుకున్న కేసులన్నీ కూడా వాపస్ తీసుకుంటున్నామని ప్రకటించారు. చేతిలో చేయి వేసుకుని మునుపటి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఇకపై తాము ఎప్పుడూ ఇలానే ఉంటామని, మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన మధ్యవర్తుల పని పడతామని నట్టి కుమార్ అన్నారు.
ఇటీవల హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రాంగోపాల్ వర్మ క్రాంతి, కరుణలు డాక్యుమెంట్ ఫోర్జరీ చేశారంటూ వివిధ సెక్షన్ల కింద వారిద్దరిపై కేసు పెట్టడంతో, దానిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. శుక్రవారం హైకోర్టులో వర్మ పెట్టిన కేసుపై విచారణ జరిపారు. నట్టి క్రాంతి, కరుణలను అరెస్ట్ చేయవద్దని, అయితే ఈ కేసుపై పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చని హైకోర్టు వివరణ ఇచ్చింది.
Next Story