Wed Dec 04 2024 18:20:25 GMT+0000 (Coordinated Universal Time)
RGV : తనకి నచ్చిన అమ్మాయితో మూవీ అనౌన్స్ చేసిన ఆర్జీవీ..
ఇటీవల ఆర్జీవీ ఓ మలయాళ అమ్మాయిపై మనసు పారేసుకున్న తెలిసిందే. తాజాగా ఆమెతో వర్మ సినిమా అనౌన్స్ చేసేశారు.
RGV : రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక అమ్మాయి గురించి అడుగుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఓ వీడియో చూసిన ఆర్జీవీ ఆమె పై మనసు పారేసుకున్నారు. చీరలో పడుచు అందాలు ఒలికిస్తూ తన వయ్యారాలతో వర్మని మతి తప్పేలా చేసింది. దీంతో ఆ అమ్మాయి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ అమ్మాయి ఎవరు అని వివరాలు అడిగారు.
ఇక ఆమె తెలిసిన వారు వివరాలను సోషల్ మీడియా ద్వారా ఆర్జీవీకి తెలియజేశారు. ఆమె మళయాళం ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ అని తెలిసింది. ఆమె అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్, కానీ స్క్రీన్ నేమ్ ఆరాధ్య దేవిగా అందరికి పరిచయం. ఇక ఆమె తెలిసిన తరువాత ఆర్జీవీ.. ఆమెకు సంబంధించిన రీల్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమెను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆమె పై వర్మ ఇంటరెస్ట్ చూసిన ఆడియన్స్.. ఆర్జీవీ తప్పకుండా ఆమెతో సినిమా చేస్తారని భావించారు.
ఇక అందరూ ఊహించినట్లే వర్మ ఆమెతో సినిమా ప్రకటించేశారు. ఆమె తన చీర సోయగాలతోనే ఆర్జీవీ మనసు దోచుకుంది కాబట్టి.. చీర అందాలతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే 'శారీ' అనే టైటిల్ తో మూవీని ప్రకటించారు. అలాగే మూవీ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. నేడు డిసెంబర్ 21న ఇంటర్నేషనల్ శారీ డే కావడంతో ఈ మూవీని అనౌన్స్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్జీవీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అఘోష్ వైష్ణవం ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పోస్టర్ మీద క్యాప్షన్ తో సినిమా స్టోరీ లైన్ ఏంటో అని తెలియజేశారు. "శృతిమించిన ప్రేమ కూడా ప్రమాదకరమే" అని లైన్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. వరుసగా ఈ సినిమా పోస్టర్స్ వర్మ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వాటిని మీరు కూడా చూసేయండి.
Next Story